- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
టర్కీ ప్రెసిడెంట్‌తో పాక్ ప్రధాని భేటీ.. పాక్‌కు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు!
టర్కీ ప్రెసిడెంట్‌తో పాక్ ప్రధాని భేటీ అయ్యారు. భారత్‌తో ఉద్రిక్తతల సమయంలో పాక్‌కు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల సమయంలో తమకు మద్దతిచ్చిన టర్కీ అధ్యక్షుడు రీసెప్ టాయిప్ ఎర్డోగన్‌ను పాక్ ప్రధాని షాబాజ్ షరీఫ్ కలిశారు. ‘నా సోదరుడు ప్రెసిడెంట్ రీసెప్ టాయిప్ ఎర్డోగాన్‌ను ఇస్తాంబుల్‌లో కలిసే గౌరవం దక్కింది. భారత్, పాక్ ఉద్రిక్తతల సమయంలో పాకిస్తాన్‌కు మద్దతిచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. టర్కీ సోదరసోదరీమణులకు పాకిస్తాన్ ప్రజల కృతజ్ఞతలు తెలియజేశాను’ అని షాబాజ్ షరీఫ్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. అలాగే రెండు దేశాల మధ్య ఉన్న బహుముఖ ద్వైపాక్షిక ఒప్పందాలను మరోసారి రివ్యూ చేశామని, ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడుల ఒప్పందాలపై చర్చించామని షరీప్ తెలిపారు.
‘రెండు దేశాల మధ్య సహకారం, సౌభ్రాతృత్వాన్ని మరింత బలపరిచేందుకు ఇంకా సన్నిహితంగా కలిసి పనిచేయాలని నిర్ణయించాం’ అని ఆయన పేర్కొన్నారు. విద్యతోపాటు ఉగ్రవాదంపై పోరులో ఇంటెలిజెన్స్ పంచుకోవడం, సాంకేతిక సహకారం పెంపొందించుకోవడంపై ఇరుదేశాల నేతలు చర్చించినట్లు ఎర్డోగాన్ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. ఈ సమావేశంలో టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్, డిఫెన్స్ మినిస్టర్ యాసర్ గులర్, ఇంటెలిజెన్స్ సంస్థ చీఫ్ ఇబ్రహీం కలిన్ కూడా పాల్గొన్నారు.






