- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakisthan: అణ్వాయుధాలను ఆధునీకరిస్తున్న పాక్.. నివేదికలో సంచలన విషయాలు
ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: ఆపరేషన్ సిందూర్ (Operation Sindhoor) తర్వాత భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే అమెరికాకు చెందిన యూఎస్ డిఫెన్స్ ఇంటలిజెన్స్ ఏజెన్సీ (DIA) ఓ సంచలన నివేదికను విడుదల చేసింది. భారత్ దాడి తర్వాత తన పరిస్థితిని గమనించిన పాక్ అణ్వాయుధ ఆధునీకరణకు ప్రాధాన్యత ఇస్తోందని తెలిపింది. అంతేగాక భారత్‌ను తన ఉనికికి ముప్పుగా భావిస్తోందని పేర్కొంది. యుద్ధం టైంలో ఉపయోగించగల ఆర్టిలరీ వెపన్స్‌ను పాకిస్తాన్ వేగంగా తయారు చేస్తోందని హెచ్చరించింది. ‘గ్లోబర్ థ్రెట్ అసెస్ మెంట్-2025’ పేరుతో రిలీజ్ చేసిన రిపోర్టులో డీఐఏ ఈ విషయాలు వెల్లడించింది. భారత్‌ను పాక్ దీర్ఘకాలిక ముప్పుగా పరిగణిస్తోందని తెలిపింది. అందుకే పాక్ సైనిక సామగ్రి ఆధునీకరణకే మొగ్గు చూపుతోందని స్పష్టం చేసింది. అణ్వాయుధాలను అప్ గ్రేడ్ చేస్తోందని, అంతేగాక తనకు సన్నిహితంగా ఉండే ఇతర దేశాల నుంచి ఆయుధాలు, సామగ్రిని కొనుగోలు చేస్తోందని తెలిపింది. వచ్చే ఏడాది పాక్ సైనిక మౌలిక సదుపాయాలకు అభివృద్ధి చేయడంపైనే దృష్టి సారించిందని అంచనా వేసింది.
చైనాతోనే లింక్ !
చైనాతో పాక్‌కు ఉన్న సంబంధాలపైనా నివేదిక ఫోకస్ చేసింది. విధ్వంసకర ఆయుధాల తయారీకి పాక్‌కు చైనా మద్దతిస్తోందని తెలిపింది. వెపన్స్ తయారీకి కావాల్సిన సామాగ్రిని, సాంతకేతికతను చైనా అందిస్తోందని వెల్లడించింది. ఈ పరికరాలు చైనా నుంచి నేరుగా సరఫరా అవుతాయని మరికొన్ని సార్లు హాంకాంగ్, సింగపూర్, తుర్కియే, యూఏఈ ద్వారా ట్రాన్స్ పోర్ట్ అవుతాయని పేర్కొంది. పాక్‌కు చైనా పూర్తి వెన్నెముకగా మారిందని హెచ్చరించింది. అయితే చైనా పాక్ ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టుల్లో పని చేసే చైనా కార్మికుల హత్యల కారణంగా ఇరు దేశాల మధ్య కాస్త ఘర్షణ ఏర్పడిందని అభిప్రాయపడింది.
మేక్ ఇన్ ఇండియాపై భారత్ దృష్టి
భారత్ తన దేశీయ రక్షణ పరిశ్రమను బలోపేతం చేయడానికి, సైన్యాన్ని ఆధునీకరించడానికి మేక్ ఇన్ ఇండియా చొరవను ముందుకు తీసుకెళ్లాలని భావిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. అలాగే రష్యాతో తన వ్యూహాత్మక సంబంధాన్ని కొనసాగించే అవకాశం ఉందని అంచనా వేసింది. ‘ మోడీ హయాంలో భారత్ రష్యా సైనిక పరికరాల కొనుగోలును తగ్గించింది. కానీ చైనా పాక్ నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడానికి ఇప్పటికీ రష్యన్ విడిభాగాలపై ఆధారపడుతుంది’ అని పేర్కొంది.ప్రధాని మోడీ రక్షణ ప్రాధాన్యతలు ప్రపంచ నాయకత్వాన్ని ప్రదర్శించడం, చైనాను ఎదుర్కోవడం, దేశ సైనిక శక్తిని పెంచడంపై దృష్టి సారిస్తాయని నొక్కి చెప్పింది.






