Pakisthan: ఉగ్రవాద నియంత్రణలో పాక్ కీలక భాగస్వామి.. అమెరికా కీలక వ్యాఖ్యలు

by B.Srinivas |

ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో పాక్ కీలక భాగస్వామి అని అమెరికా ఆర్మీ సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ మైఖేల్ కురిల్లా అభివర్ణించారు.

Pakisthan: ఉగ్రవాద నియంత్రణలో పాక్ కీలక భాగస్వామి.. అమెరికా కీలక వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదంపై జరుగుతున్న పోరాటంలో పాక్ కీలక భాగస్వామి అని అమెరికా ఆర్మీ సెంట్రల్ కమాండ్ చీఫ్ జనరల్ మైఖేల్ కురిల్లా అభివర్ణించారు. ఆ దేశం టెర్రరిజంపై కఠినంగా వ్యవహరిస్తోందని తెలిపారు. హౌస్ ఆర్మ్డ్ సర్వీసెస్ కమిటీ సమావేశంలో ఆయన ప్రసంగించారు. ఐసిస్-ఖోరాసన్ పై పాక్ చేసిన ఆపరేషన్ ను ప్రశంసించారు. పాక్‌తో అపూర్వమైన భాగస్వామ్యం ద్వారా వారు ఐసిస్-కేపై చర్యలు తీసుకున్నారని, డజన్ల కొద్దీ సభ్యులను మట్టుబెట్టారని తెలిపారు. యూఎస్ అందించిన సమాచారం ఆధారం పాక్ చర్యలు తీసుకుందని ఐసిస్ కేకు చెందిన ఐదుగురు అగ్ర కమాండర్లను పట్టుకోవడంలో విజయం సాధించిందని కొనియాడారు.

ఆప్ఘనిస్థాన్ కేంద్రంగా పని చేస్తూ అమెరికా సహా ప్రపంచ వ్యాప్తంగా దాడులకు పాల్పడుతున్న ఐసిస్ కే మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుని పాక్ ఎన్నో ఆపరేషన్స్ చేపట్టిందన్నారు. ఇందుకు పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ ఎంతో సహాయ పడ్డారని తెలిపారు. భారత్, పాకిస్థాన్ రెండు దేశాలతోనూ అమెరికా సంబంధాలను కొనసాగించాల్సి ఉంటుందని, ఈ విషయంలో మార్పు ఉండబోదని స్పష్టం చేశారు. కాగా, ఆపరేషన్ సిందూర్ అనంతరం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని భారత్ ప్రపంచ వ్యాప్తంగా తన వాదనను వినిపించింది. ఈ నేపథ్యంలోనే మైఖేల్ వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.

Next Story