- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakisthan: భారత హైకమిషన్ సిబ్బందిని బహిష్కరించిన పాక్.. 24 గంటల్లోపు దేశాన్ని వీడాలని ఆదేశాలు
గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో న్యూఢిల్లీలోని పాకిస్తాన్ హైకమిషన్ సిబ్బందిని భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే.

దిశ, నేషనల్ బ్యూరో: గూఢచర్యానికి పాల్పడ్డాడనే ఆరోపణలతో న్యూఢిల్లీలోని పాకిస్తాన్(Pakisthan) హైకమిషన్ సిబ్బందిని భారత్ బహిష్కరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే పాక్ సైతం ప్రతీకార చర్యలకు దిగింది. పాక్‌లోని భారత హైకమిషన్ ఉద్యోగిపై వేటు వేసింది. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ అధికారి తన హోదాకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, అందుకే పర్సోనా నాన్ గ్రాటాగా (Persona non grata) ప్రకటిస్తున్నట్టు తెలిపింది. 24 గంటల్లోగా దేశాన్ని వీడాలని ఆదేశించింది. ఈ డిసిషన్ గురించి తెలియజేయడానికి భారత హైకమిషనర్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖకు పిలిపించారు. భారత అధికారులు తమ దౌత్య హోదాను దుర్వినియోగం చేయకూడదని చెప్పినట్టు తెలుస్తోంది. కాగా, పహెల్గాం ఉగ్రదాడి అనంతరం ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అప్పటి నుంచి భారత్ రెండు సార్లు ఇద్దరు పాక్ హైకమిషన్ అధికారులను బహిష్కరించింది. ఈ క్రమంలోనే పాక్ సైతం చర్యలకు దిగుతోంది.






