Pakistan MP: హర్యానాలో పార్టీ మీటింగ్.. పాకిస్తాన్ ఎంపీ హాజరు

by Mahesh Kanagandla |

హర్యానాలో ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్‌డీ/INLD) పార్టీ తమ సీనియర్ నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ఎంపీ అబ్దుల్ రెహమాన్ కాంజు హాజరయ్యారు.

Pakistan MP: హర్యానాలో పార్టీ మీటింగ్.. పాకిస్తాన్ ఎంపీ హాజరు
X

దిశ, నేషనల్ బ్యూరో: హర్యానా(Haryana)లో ఇండియన్ నేషనల్ లోక్ దళ్(ఐఎన్ఎల్‌డీ/INLD) పార్టీ తమ సీనియర్ నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించగా.. ఈ కార్యక్రమానికి పాకిస్తాన్ ఎంపీ(Pakistan MP) అబ్దుల్ రెహమాన్ కాంజు(Abdul Rehman Kanju) హాజరయ్యారు. సిర్సా జిల్లా చౌతలా గ్రామంలో దీపావళి(Deepavali) రోజే ఈ కార్యక్రమం నిర్వహించడంతో పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. తమ చీఫ్ గెస్టు పాకిస్తాన్ రాజకీయ నాయకుడు అబ్దుల్ రెహమాన్ కాంజు హాజరయ్యారని ఐఎన్ఎల్‌డీ గొప్పగా సోషల్ మీడియాలోనూ ప్రచారం చేసుకుంది. ఐఎన్ఎల్‌డీ పునరుజ్జీవనం పొందడంలో హర్యానా అసెంబ్లీ ఎన్నికలు 2014లో ఎమ్మెల్యేలుగా గెలవడం కీలక దశగా పార్టీ నేతలు చెబుతున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన పాక్ ఎంపీ అబ్దుల్ మాట్లాడుతూ ఈ గ్రామ ప్రజలు చూపిన ఆదరణ, ప్రేమ మరువలేదని పేర్కొన్నారు. పంజాబ్ సమీపంలోని ఆయన పూర్వీకుల గ్రామాన్ని గుర్తు చేసుకుంటూ పిన్నవయసులోనే తండ్రిని కోల్పోయిన తనకు చౌతలా కుటుంబం ఎన్నో విధాలుగా సహకరించిందని వివరించారు. కొన్ని దశాబ్దాలుగా చౌతలా కుటుంబం ప్రజా సంక్షేమానికి కట్టుబడి ఉన్నదని, ఇకపైనా అలాగే ఉంటారని విశ్వాసంగా చెప్పారు. గ్రామ ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు చెప్పిన అబ్దుల్ రెహమాన్ కాంజు.. మాజీ సీఎం ఓం ప్రకాశ్ చౌతలా చిరంజీవగా బతకాలని కోరుకున్నారు.

Next Story