అహ్మదాబాద్ స్కూళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ‘పాక్’

by Dishanational6 |
అహ్మదాబాద్ స్కూళ్లకు బాంబు బెదిరింపుల వెనుక ‘పాక్’
X

దిశ, నేషనల్ బ్యూరో: గుజరాత్ లో స్కూళ్లకు బాంబు బెదిరింపు వచ్చిన కేసులో సంచలనాలు బయటకొచ్చాయి. అహ్మాదాబాద్ స్కూళ్లకు బెదిరింపు ఈమెయిల్స్ లో పాకిస్థాన్ లింక్ ను గుర్తించామని పోలీసులు ప్రకటించారు. బాంబు బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చిన కొన్ని రోజులకే ఈ విషయం బయటకొచ్చింది. ఫస్ట్ ఈ ఈమెయిల్స్ రష్యన్ డొమైన్ నుంచి వచ్చాయని భావించారు అధికారులు.

అయితే, విచారణలో పాకిస్థాన్ లోని మిలిటరీ కంటోన్మెంట్ తో సంబంధం ఉన్నట్లు తేలింది. “[email protected]” అనే ఈమెయిల్ నుంచి బెదిరింపు ఈ మెయిల్స్ వచ్చాయి. అహ్మద్ జావేద్ పేరుతో పనిచేస్తున్న తోహిక్ లియాకత్ అనే వ్యక్తికి సంబంధించిన ఈ మెయిల్ గా అధికారులు గుర్తించారు. ఈ విషయాన్ని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ జేసీపీ శరద్ సింఘాల్ తెలిపారు.

మే 6న.. లోక్ సభ మూడో దశ ఎన్నికల ముందు అహ్మదాబాద్‌లోని కనీసం 14 పాఠశాలలకు బెదిరింపు ఈమెయిల్స్ వచ్చాయి. అయితే, పోలీసులు క్షుణ్ణంగా సోదాలు చేసిన తర్వాత, ఏ పాఠశాలలో అనుమానితుడు లేదా పేలుడు పదార్థాలు కనుగొనబడలేదు. అధికారుల తనిఖీల తర్వాత ఇవి బూటకపు బెదిరింపులని తేలింది. గుజరాత్ లోని అన్ని ఎంపీ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్‌తో సహా పోలీసు అధికారుల బృందాలు పాఠశాలల్లో సోదాలు నిర్వహించాయి. ఎలాంటి అనుమానాస్పద వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.

గత వారం ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, గ్రేటర్ నోయిడాలోని 151 స్కూళ్లకు బాంబు బెదిరింపు ఈమెయిళ్లు వచ్చాయి. దీంతో విద్యార్థుల్ని వెంటనే స్కూళ్ల నుంచి ఇళ్లకు పంపించారు. పోలీసులు ఇతర అధికారులు పాఠశాలల్ని క్షణ్ణంగా తనిఖీ చేసిన తర్వాత బూటకపు బాంబు బెదిరింపులుగా తేల్చారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed