- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: ప్లీజ్ ఆలోచించండి.. భారత్‌కు పాకిస్తాన్ లేఖ
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడి చేసి.. సుమారు 70 మంది ఉగ్రవాదుల్ని హతమార్చాయి.

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత పాక్ పై తీసుకున్న చర్యల్లో భాగంగా భారత్ సింధు నదీజలాల ఒప్పందాన్ని (Indus Water Treaty) నిలిపివేసింది. సింధు నది, దాని ఉపనదుల నుంచి పాకిస్తాన్ కు చుక్కు నీరు కూడా పోకుండా డ్యామ్ ల గేట్లు మూసివేసింది. దీంతో పాకిస్తాన్ ఇప్పుడు తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటోంది. దీంతో తాజాగా పాకిస్తాన్ భారత్ కు లేఖ రాసిందని నేషనల్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. సింధునదీ జలాల ఒప్పందంపై పునః సమీక్షించాలని ఆ లేఖలో కోరినట్లు సమాచారం. భారత్ ఈ విషయంలో మళ్లీ ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని, ప్రస్తుతం తాము తీవ్ర నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నామని పాక్ విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.
కాగా.. పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత త్రివిధ దళాలు ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) పేరుతో పాక్, పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK)లో ఉన్న ఉగ్రస్థావరాలపై దాడి చేసి.. సుమారు 70 మంది ఉగ్రవాదుల్ని హతమార్చాయి. ఆ తర్వాత పాక్ సైన్యం వరుసగా ఎదురు కాల్పులకు పాల్పడటంతో సరిహద్దు గ్రామాల్లో పౌరులు మరణించారు. ఇరు దేశాల మధ్య యుద్ధ వాతావరణం కనిపించింది. మధ్యలో అమెరికా జోక్యం చేసుకుని, ఇరుదేశాలు శాంతించాలని దౌత్యం చేయడంతో కాల్పుల విరమణ జరిగింది. కానీ.. మళ్లీ భారత్ లో ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధంగానే పరిగణిస్తామని భారత ప్రభుత్వం పాక్ ను హెచ్చరించింది.






