భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట పాక్ ISI కదలికలు.. హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం

by Kema Shiva Kumar |

పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) సరిహద్దులో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది.

భారత్‌-బంగ్లాదేశ్ సరిహద్దు వెంట పాక్ ISI కదలికలు.. హై అలర్ట్ ప్రకటించిన కేంద్రం
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గాం టెర్రర్ అటాక్ (Pahelgam Terror Attack) నేపథ్యంలో భారత్-బంగ్లాదేశ్ (India-Bangladesh) సరిహద్దులో కేంద్రం హైఅలర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే పొరుగు దేశాలైన బంగ్లాదేశ్, మయన్మార్ సరిహద్దుల వద్ద భద్రతను రెట్టింపు చేశారు. బంగ్లాదేశ్‌ (Bangladesh)లోని షేక్ హసీనా (Shaik Hasina) ప్రభుత్వం కుప్పకూలి మహమ్మద్‌ యూనస్‌ (Muhammad Yunus) సర్కార్ అధికారంలోకి వచ్చాక.. పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. దాయాది పాక్‌తో ఆ దేశం దోస్తీ చేస్తోంది. అదేవిధంగా పాక్‌ నిఘా సంస్థ ISI, మిలిటరీ అధికారులకు బంగ్లాదేశ్, భారత సరిహద్దు దగ్గరగా ఉండేందుకు షెల్టర్ ఇస్తూ వారు.. రెక్కీ నిర్వహించేలా బంగ్లా ఆర్మీ సహకరిస్తోందని కేంద్ర నిఘా వర్గాలు గుర్తించాయి.

ఈ నేపథ్యంలోనే ఆదేశంలో భారత్‌కు వ్యతిరేకంగా ఉన్న ర్యాడికల్ గ్రూప్‌ (Radical Group)లను పాక్ ISI పావుగా వాడుకోవాలని చూస్తున్నట్లుగా తెలుస్తోంది. దీంతో భాతర భద్రతా దళాలు బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లోని ముర్షిదాబాద్‌ (Murshidabad) లాంటి సమస్యాత్మక ప్రాంతాలపై ఫుల్ ఫోకస్ పెట్టింది. అదేవిధంగా పాక్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఎల్‌వోసీ (LOC) వెంట ఉన్న భారత పోస్టులపై విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడుతోంది. అయితే, ఆ కాల్పులను భారత ఆర్మీ (Indian Army) సమర్ధవంతంగా తిప్పి కొడుతూ.. బుల్లెట్ల వర్షం కురిపిస్తోంది. దీంతో ఆందోళనకు గురైన పాక్ తన సరిహద్దు వెంట సైన్యాన్ని భారీగా మోహరించింది. ఏ సమయంలోనైనా భారత్‌పై ఎయిర్ స్ట్రైక్ చేసేందుకు నావికాదళాన్ని సిద్ధంగా ఉంచినట్లుగా భారత నిఘా వర్గాలు గుర్తించాయి.

Next Story