- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాకిస్థాన్ అతి పెద్ద ఉగ్రవాద దేశం.. యూపీ సీఎం యోగీ సంచలన వ్యాఖ్యలు
పాకిస్థాన్ (Pakistan) అనేది అతి పెద్ద ఉగ్రవాద దేశం (Biggest Terror State) అని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ (UP CM Yogi Adithyanath) వ్యాఖ్యానించారు.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ (Pakistan) అనేది అతి పెద్ద ఉగ్రవాద దేశం (Biggest Terror State) అని యూపీ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యానాథ్ (UP CM Yogi Adithyanath) వ్యాఖ్యానించారు. గోరఖ్ పూర్ (Gorakhpur) లోని ఓ కార్యక్రమానికి హాజరైన ఆయన..ఉగ్రవాదంపై పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్ అనేది ఉగ్రవాదాన్ని ఎప్పుడూ ప్రోత్సహిస్తూ.. అతి పెద్ద ఉగ్రవాద దేశంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే ఇటీవల పాకిస్థాన్ పై దాడి చేసిన బ్రహ్మోస్ క్షిపణి (Bhrahmos Missile) లక్నో (Lucknow)లోనే తయారుచేయబడిందని, శత్రువులను వణుకు పుట్టించే అనేక ఆయుధాలు ఇక్కడే తయారు చేయబడ్డాయని తెలిపారు.
మనదేశం సురక్షితంగా ఉన్నప్పుడే మనం కూడా సురక్షితంగా ఉంటామని, దీనికోసం అన్ని విషయాల్లో మనదేశాన్ని ముందుంచాలని పిలుపునిచ్చారు. ఇక జాతి వ్యతిరేక ప్రకటనలు చేసేవారు ఎవరు అనేది తెలుసుకొని జాగ్రత్తగా మసులుకోవాలని ఆయన సూచించారు. దాడులకు వ్యతిరేకంగా భారత్, పాకిస్థాన్ దేశాలు కాల్పుల విరమణ ఒప్పందం చేసుకున్న వేళ యూపీ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరంగా మారింది. పాకిస్థాన్ ను ఉగ్రవాద దేశంగా వ్యాఖ్యానించిన ఆయన మాటలు చర్చనీయాంశంగా మారాయి.






