- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Pakistan: పాక్ హైకమిషన్ ఉద్యోగిపై భారత్ వేటు.. 24 గంటల్లోగా దేశాన్ని వీడాలని ఆదేశాలు
భారత్ పాక్‌ల మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

దిశ, నేషనల్ బ్యూరో: భారత్ పాకిస్థాన్‌ల (India pakisthan) మధ్య ఉద్రిక్త పరిస్థితులు తగ్గిన నేపథ్యంలో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఢిల్లీలోకి పాక్ హైకమిషన్ (Pak high commission) కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఓ అధికారిని భారత్ బహిష్కరించింది. 24 గంటల్లోగా దేశాన్ని వీడాలని ఆదేశించింది. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ మంగళవారం ఆర్డర్స్ జారీ చేసింది. ‘ఢిల్లీలోని పాక్ హై కమిషన్‌లో పని చేస్తున్న ఒక పాక్ ఆఫీసర్ దౌత్య పరమైన నిబంధనలు ఉల్లంఘించారు. అధికారిక హోదాకు సంబంధం లేని కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. కాబట్టి ప్రభుత్వం పర్సోనా నాన్ గ్రాటాగా ప్రకటించింది. ఆయన 24గంటల్లోగా దేశాన్ని వీడాలి. పాకిస్తాన్ హైకమిషన్ చార్జ్ డీ అఫైర్స్‌కు ఆర్డర్స్ ఇచ్చాం’ అని తెలిపింది. అయితే ఆఫీసర్ పేరును ప్రభుత్వం వెల్లడించలేదు. సీజ్ ఫైర్ ముగిసిన వెంటనే భారత్ కీలక నిర్ణయం తీసుకోవడం హాట్ టాపిక్‌గా మారింది.






