- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Pakisthan: చర్చలు విఫలమైతే యుద్ధం తప్పదు.. ఆఫ్ఘనిస్థాన్‌కు పాక్ వార్నింగ్
శాంతి చర్చల్లో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోకపోతే బహిరంగ యుద్ధానికి దారి తీయొచ్చని ఖవాజా ఆసిఫ్ ఆప్ఘనిస్థాన్‌ను హెచ్చరించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఇస్తాంబుల్‌లో జరుగుతున్న శాంతి చర్చల్లో ఎటువంటి ఒప్పందం కుదుర్చుకోకపోతే బహిరంగ యుద్ధానికి దారి తీయొచ్చని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ (Kawaja asif) ఆప్ఘనిస్థాన్‌ను హెచ్చరించారు. చర్చలు విఫమైతే యుద్ధం చేయడం తప్ప వేరే మార్గం లేదన్నారు. కానీ వారు శాంతిని కోరుకుంటున్నట్టు కనిపిస్తోందన్నారు. ఇరు దేశాల మధ్య జరిగే చర్చలు దీర్ఘకాలిక కాల్పుల విరమణ అమలు చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలిపారు. తుర్కియే రాజధాని ఇస్తాంబుల్‌లో ఆఫ్ఘనిస్తాన్ (Afganisthan), పాకిస్థాన్ (Pakisthan) మధ్య రెండో విడత శాంతి చర్చలు జరగనున్న నేపథ్యంలో ఆసిఫ్ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. కాగా, టీటీపీ స్థావరాలపై పాక్ దాడి చేయడంతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే తొలి దశ కాల్పుల విరమణ అమల్లోకి వచ్చినప్పటికీ అది ఉల్లంఘించబడింది. ఈ నేపథ్యంలోనే మరోసారి చర్చలు జరుగుతున్నాయి.






