- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పహల్గామ్ దాడి సూత్రధారికి పాక్ సర్కార్ ఫుల్ సెక్యూరిటీ..! ఇంటి కిందే భారీ బంకర్?
పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడితో ప్రపంచ దేశాలు నిర్ఘంతపోయాయి.

దిశ, వెబ్‌డెస్క్ : పహల్గామ్‌లో టూరిస్టులపై ఉగ్రవాదులు చేసిన దాడితో ప్రపంచ దేశాలు నిర్ఘంతపోయాయి. ప్రకృతి అందాలను ఆస్వాదించడానికి వచ్చిన పర్యాటకులను హిందువా, ముస్లింవా అని తెలుసుకోని మరి భార్య, పిల్లల ఎదుటే దారుణంగా కాల్చి చంపారు. ఈ ఘటన ఇంకా భారతీయుల కళ్ల ముందే తేలియాడుతుంది. ఈ ఎటాక్‌కు తామే కారణమని ఉగ్రవాద సంస్థ ‘ది రిసెస్టెన్స్ ఫ్రంట్’ (TRF) ప్రకటించింది. పాకిస్థాన్‌కు చెందిన ఈ సంస్థ భారతీయులను కిరాతంగా హత్య చేసింది. దీనిని ఖండించాల్సిన పాక్.. తన వక్రబుద్ధిని బయటపెట్టుకుంది. ఈ ఉగ్రదాడిపై విచారణ చేస్తున్నాం అని చెబుతూనే దాడులకు కారణమైన సూత్రధారికి ప్రభుత్వమే భద్రత కల్పించడం ఆందోళన కలిగిస్తోంది.
ఉగ్రదాడికి ప్లాన్ వేసిన సూత్రధారి లష్కరే తోయిబా చీఫ్, భారత మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది హఫీజ్ సయీద్‌కు పాక్ సర్కార్ అధికారికంగా భారీ సెక్యూరిటీని కల్పించినట్టు వార్తలు వస్తున్నాయి. లాహోర్‌లోని అత్యంత రద్దీ ప్రాంతమైన జోరమ్ తౌమ్ ప్రాంతంలో హఫీజ్ సయీద్ నివాసం ఉంది. కుటుంబంతో కలిసి ఉంటున్న ఆ ఇంటికి పాక్ ప్రభుత్వ అధికారులతో సెక్యూరిటీని కల్పిస్తున్నట్టు స్పష్టం అయింది. ఆ ఇంటి కింద భారీ బంకర్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇటీవల లష్కరే ఉగ్రవాదులతోపాటు హఫీజ్ అనుచరులు వరుసగా హత్యలకు గురవుతుండటంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అయితే పాక్ సర్కార్ మాత్రం హఫీజ్ 2019 నుంచి జైళ్లోనే ఉంటున్నాడని, ఇప్పుడు కూడా అందులోనే ఉన్నాడని బుకాయిస్తుండటం గమనార్హం.
Read Also..
Lahore: పహెల్గాం ఉగ్రదాడిలో కీలకసూత్రధారి లష్కరే తోయిబా చీఫ్






