- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ind vs Pak: రాజ్‌నాథ్‌సింగ్ వ్యాఖ్యల్ని ఖండించిన పాక్..
కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) పాకిస్తాన్లో ఉనన అణ్వాయుధాల భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు.

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ (Rajnath Singh) పాకిస్తాన్లో ఉనన అణ్వాయుధాల భద్రతపై అనుమానం వ్యక్తం చేశారు. గురువారం జమ్మూకశ్మీర్ లో పర్యటించిన ఆయన.. అమర సైనికులకు నివాళులర్పించారు. అనంతరం భారత్ - పాకిస్తాన్ల మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో పోరాడి దేశానికి రక్షణగా నిలిచిన సైనికుల్ని అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రాజ్ నాథ్ సింగ్.. పాక్ అణుబాంబుల బెదిరింపులకు (Pak Nuclear Blackmailing) భయపడేదే లేదన్నారు. ఎవరు కాళ్లబేరానికి వచ్చారో ప్రపంచమంతటికీ తెలుసన్నారు. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే దేశం చేతుల్లో అణ్వాయుధాలు సేఫ్ గా ఉంటాయా ? రాజ్ నాథ్ సింగ్ ప్రశ్నించారు. అందుకే పాక్ అణ్వాయుధాలను అంతర్జాతీయ అణుశక్తి సంస్థ పర్యవేక్షణలోకి తీసుకోవాలన్నారు.
కాగా.. పాక్ అణ్వాయుధాల భద్రతపై రాజ్ నాథ్ సింగ్ చేసిన వ్యాఖ్యల్ని పాక్ విదేశాంగశాఖ ఖండించింది. తమదేశ అణ్వాయుధాలను అణుశక్తి సంస్థ పర్యవేక్షించాలని రాజ్ నాథ్ చేసిన వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పాక్ విదేశాంగ శాఖ వెల్లడించింది. భారత్ ను ఎదుర్కొనేందుకు తమ సైనికుల వద్ద ఉన్న సామర్థ్యాలు సరిపోతాయని ప్రేలాపనలు పలికింది.






