Pakisthan: పాక్‌కు వరద అలర్ట్.. తావి నది పరిస్థితిని తెలియజేసిన భారత్

by B.Srinivas |

సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. తావి నది వరద పరిస్థితిపై భారత్ సమాచారం తెలియజేసింది.

Pakisthan: పాక్‌కు వరద అలర్ట్.. తావి నది పరిస్థితిని తెలియజేసిన భారత్
X

దిశ, నేషనల్ బ్యూరో: పాకిస్థాన్‌కు సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేసిన తర్వాత కీలక పరిణామం చోటు చేసుకుంది. జమ్మూ కశ్మీర్‌ (Jammu Kashmir) లోని తావి నది వరద పరిస్థితిపై భారత్ పాకిస్థాన్‌కు సమాచారం తెలియజేసింది. ఈ నది నుంచి భారీ వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ విషయాన్ని ఇస్లామాబాద్‌లోని భారత హైకమిషన్ పాక్ విదేశాంగ మంత్రిత్వ శాఖకు సమాచారం అందించింది. దీంతో ఇండియా సమాచారం ఇచ్చిన తర్వాత పాక్ సైతం అప్రమత్తమైనట్టు పలు కథనాలు పేర్కొన్నాయి. హైకమిషన్ ద్వారా ఈ తరహా ఇన్ఫర్మేషన్ పంచుకోవడం ఇదే తొలిసారి. సాధారణంగా ఇటువంటి సమాచారాన్ని సింధూ జలాల ఒప్పందం ప్రకారం ఇరు దేశాల కమిషనర్లు షేర్ చేసుకునే వారు. కానీ పహెల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ అగ్రిమెంట్‌ను రద్దు చేసింది. ఈ క్రమంలోనే వరద పరిస్థితిపై పాక్ ను అలర్ట్ చేయడం గమనార్హం. అయితే మానవతా ధృక్పదంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని విదేశాంగ శాఖ తెలిపింది.

Next Story