విదేశాలకు బయల్దేరిన పాక్ దౌత్య బృందాలు

by Phanindra |

విదేశాలకు బయల్దేరిన పాక్ దౌత్య బృందాలు. భారత్‌లాగే అంతర్జాతీయ మద్దతు కూడగట్టేందుకు పాక్ ప్రయత్నం.

విదేశాలకు బయల్దేరిన పాక్ దౌత్య బృందాలు
X

దిశ, నేషనల్ బ్యూరో: భారత్, పాక్ ఉద్రిక్తతల అనంతరం తమ దేశానికి మద్దతు కూడగట్టేందుకు పాకిస్తాన్ కూడా వివిధ దేశాలకు దౌత్య బృందాలను పంపుతోంది. భారత ప్రభుత్వం ఏడు బృందాలను 33 దేశాలకు పంపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారత వ్యూహాలను కాపీ కొట్టిన పాక్ ప్రధాని కూడా.. రెండు దౌత్య బృందాలను సిద్ధం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ బృందాలు సోమవారం నాడు పాక్ నుంచి బయలుదేరినట్లు పాక్ విదేశాంగ శాఖ ప్రకటించింది.


వీటిలో 9 మంది సభ్యులున్న ఒక బృందానికి పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ చైర్మన్, ఆ దేశ మాజీ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందం న్యూయార్క్, వాషింగ్టన్ డీసీ, లండన్, బ్రసెల్స్ వంటి కీలక నగరాల్లో పర్యటించనుందట. మరో బృందానికి పాక్ ప్రధాని స్పెషల్ అసిస్టెంట్ సయ్యద్ తారీఖ్ ఫతేమీ నేతృత్వం వహిస్తున్నారు. ఈ బృందం తొలుత రష్యా రాజధాని మాస్కోకు వెళ్తున్నట్లు పాక్ ప్రకటించింది. ‘ఆపరేషన్ సిందూర్’ తర్వాత పాక్‌కు మద్దతు కూడగట్టేందుకు ఈ బృందాలు వెళ్తు్న్నట్లు తెలుస్తోంది.

Next Story