- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్

దిశ, వెబ్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. మొదట ఆఫ్ఘనిస్తాన్ దాడులు చేయగా... దానికి ప్రతీకారంగా పాకిస్తాన్ కూడా విరుచుకుపడుతున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఆపరేషన్ గజబ్ - లీల్ హక్ ( Operation Ghazab Lil Haq) పేరుతో ఏకంగా రాజధాని కాబూల్ పైన దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. కాందహార్, పక్తియాలోని మిలిటరీ బేస్ ల పైన కూడా పాకిస్తాన్ సేన విరుచుకుపడినట్లు సమాచారం అందుతోంది. అనేక ఆర్మీ పోస్టులను ధ్వంసం కూడా చేసిందని అంటున్నారు.
పాక్ ఎటాక్ నేపథ్యంలో తాలిబన్ల నెట్వర్క్ భారీగా దెబ్బతిన్నట్లు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ గా మారాయి. ఇక అంతకుముందు డ్యూరాండ్ రేఖ వెంబడి ఉన్న పాకిస్తాన్ సైనిక స్థావరాలపై ఆఫ్ఘనిస్తాన్ దాడి చేసింది. ఈ సందర్భంగా 15 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్నట్లు తాలిబన్స్ ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ రివర్స్ అటాక్ చేస్తోంది. ఇది ఇలా ఉండగా 15 చెక్ పోస్టులను స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆయా చెక్ పోస్టుల దగ్గర భారీగా కరెన్సీ తాలిబన్లకు లభ్యమైనట్లు వీడియోలు కూడా వస్తున్నాయి.






