పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీల అకౌంట్లు అన్‌బ్లాక్?.. భారత్‌లో ఆన్‌లైన్‌లోకి!

by Phanindra |

పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీల అకౌంట్లు అన్‌బ్లాక్ అయ్యాయా? అంటే అవుననే అనిపిస్తోంది. పలు పాక్ ఛానెల్స్ భారత్‌లో ఆన్‌లైన్‌లోకి వచ్చాయి.

పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీల అకౌంట్లు అన్‌బ్లాక్?.. భారత్‌లో ఆన్‌లైన్‌లోకి!
X

దిశ, నేషనల్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌కు చెందిన యూట్యూబ్ ఛానెల్స్, సెలెబ్రిటీల సోషల్ మీడియా ఖాతాలు అన్నింటినీ భారత దేశంలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలతో పాక్‌కు చెందిన పలు న్యూస్ ఛానెల్స్‌ను కూడా భారత్ బ్యాన్ చేసింది. అయితే బుధవారం నాడు ఈ ఛానెల్స్ అన్నీ భారత్‌లో ఆన్‌లైన్‌లోకి వచ్చాయి.

సాబా కమర్, అహద్ రజా మిర్, హనియా మిర్ వంటి పాక్ సెలెబ్రిటీల ఇన్‌స్టాగ్రాం ఖాతాలు కూడా భారత్‌లో అన్‌బ్లాక్ అయ్యాయి. పలు పాక్ న్యూస్ ఛానెల్స్ కూడా యూట్యూబ్‌లో దర్శనం ఇచ్చాయి. దీంతో పాక్ ఛానెల్స్, సెలెబ్రిటీలపై భారత్‌లో బ్యాన్ తొలగించారా? అని ప్రజలు అనుమానిస్తున్నారు. అయితే భారత ప్రభుత్వం నుంచి ఈ విషయంలో ఎలాంటి ప్రకటన రాలేదు. కానీ ఈ ఛానెల్స్, సోషల్ మీడియా ఖాతాలు ఆన్‌లైన్‌లో కనిపిస్తున్న నేపథ్యంలో దీనిపై కేంద్రం ప్రకటన కూడా వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Next Story