- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bangladesh: పాక్-బంగ్లా మధ్య ఒప్పందం.. 1971 తర్వాత తొలిసారిగా..
బంగ్లాదేశ్(Bangladesh) ప్రధానిగా షేక్ హసీనా (Sheikh Hasina) పదవికోల్పోయినప్పటి నుంచి అక్కడి యూనస్ సర్కారు పాకిస్థాన్ (Pakistan) అనుకూల వైఖరి కనబరుస్తోంది.

దిశ, నేషనల్ బ్యూరో: బంగ్లాదేశ్(Bangladesh) ప్రధానిగా షేక్ హసీనా (Sheikh Hasina) పదవికోల్పోయినప్పటి నుంచి అక్కడి యూనస్ సర్కారు పాకిస్థాన్ (Pakistan) అనుకూల వైఖరి కనబరుస్తోంది. 1971లో పాకిస్థాన్, బంగ్లాదేశ్ విడిపోయినప్పట్నుంచి తొలిసారిగా ప్రత్యక్ష వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాయి. ప్రభుత్వం ఆమోదించిన మొదటి కార్గో కరాచీలోని పోర్ట్ ఖాసిమ్ నుంచి ఢాకాకు బయలుదేరినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఫిబ్రవరి ప్రారంభంలో బంగ్లాదేశ్ ట్రేడింగ్ కార్పొరేషన్ ఆఫ్ పాకిస్తాన్ (TCP) ద్వారా 50,000 టన్నుల బియ్యాన్ని పాకిస్థాన్ నుంచి కొనుగోలు చేసేందుకు అంగీకరించినప్పుడు ఈ ఒప్పందం ఖరారయ్యింది. ది ఎక్స్ ప్రెస్ ట్రిబ్యూన్ వార్తాపత్రిక కథనంలో.. ‘‘1971 తర్వాత తొలిసారిగా పాకిస్థాన్ నేషనల్ షిప్పింగ్ కార్పోరేషన్ (PNSC) నౌక బంగ్లాదేశ్ ఓడరేవుకు తమ ప్రభుత్వ సరుకును తీసుకెళ్తోంది. ఇది ఇరుదేశాల మధ్య సముద్ర వాణిజ్య సంబంధాలలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తోంది’’ అని అందులో పేర్కొంది. కాగా.. బియ్యం రవాణా రెండు దశల్లో పూర్తవుతోందని పేర్కొంది. ప్రస్తుతం 25వేల టన్నుల బియ్యం తరలించారని వెల్లడించింది. మరో 25,000 టన్నుల బియ్యం మార్చి ప్రారంభంలో పంపే అవకాశం ఉన్నట్లు తెలిపింది.
1971 నుంచి లోని వాణిజ్య సంబంధాలు..
కాగా.. 1971లో బంగ్లాదేశ్ తూర్పు పాకిస్థాన్ నుంచి విడిపోయి స్వతంత్ర దేశంగా ఏర్పడింది. నాటి నుంచి ఇరుదేశాల మధ్య ఎటువంటి వాణిజ్య సంబంధాలు లేవు. మరోవైపు, ఈ వాణిజ్య ఒప్పందం రెండు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను బలోపేతం చేస్తుందని, ప్రత్యక్ష షిప్పింగ్ మార్గాలను సులభతరం చేయడానికి ఉపయోగపడనున్నట్లు తెలుస్తోంది. ఈ అభివృద్ధి ఆర్థిక సహకారాన్ని పెంపొందించడంలో దశాబ్దాలుగా మూసుకుపోయిన వాణిజ్య మార్గాలను తిరిగి తెరవడంలో సానుకూల అంశంగా కనిపిస్తుంది. గతేడాది డిసెంబర్‌లో 53 ఏళ్లలో తొలిసారి పాక్ నుంచి నేరుగా బంగ్లాకు తొలికార్గో షిప్ వచ్చినట్లు అప్పట్లో స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.






