- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరోసారి ఇండియా పాక్ బార్డర్‌లో కాల్పుల కలకలం
పాకిస్థాన్ తీరు మారడంలేదు. ఓవైపు పాక్ రాజకీయనేతలు నోటిదురుసు వ్యాఖ్యలు చేస్తుంటే మరోవైపు బార్డర్ వద్ద పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ తీరు మారడంలేదు. ఓవైపు పాక్ రాజకీయనేతలు నోటిదురుసు వ్యాఖ్యలు చేస్తుంటే మరోవైపు బార్డర్ వద్ద పాక్ ఆర్మీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తాజాగా నిన్న రాత్రి కూడా పాకిస్థాన్ ఆర్మీ కాల్పులు జరిపినట్టు ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. లైన్ ఆఫ్ కంట్రోల్‌లోని కుప్వారా, ఉరి, అఖ్నూర్ సెక్టార్లలో పాక్ భారత సైనికులను లక్ష్యంగా చేసుకుని ఫైరింగ్ చేసినట్టు తెలిపింది. పాక్ చర్యలను సమర్దవంతంగా తిప్పికొట్టినట్టు వెల్లడించింది. పాక్ సైన్యం కాల్పులపై భారత్ సీరియస్ గా ఉంది.
గట్టిగా సమాధానం చెప్పాల్సి వస్తుందని వార్నింగ్ ఇచ్చింది. మరోవైపు అరేబియా సముద్రంలోనూ యుద్ద వాతావరణం కనిపిస్తోంది. సముద్రంలో పాకిస్థాన్ మరియు ఇండియా యుద్దనౌకలు మోహరించాయి. గుజరాత్ పోరుబందర్ సమీపంలో భారత్ నౌకలు సైనిక విన్యాసాలు ప్రారంభించాయి. ఈ నెల మూడవ తేదీ వరకు ఇండియన్ నేవీ విన్యాసాలు కొనసాగనున్నాయి. మరోవైపు ఈ నెల రెండవ తేదీ వరకు పాక్ నేవీ కూడా సముద్రంలో సైనిక విన్యాసాలను ప్రదర్శించనుంది. ఈ క్రమంలో ఎప్పుడు ఏం జరుగుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది.






