- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కాల్పుల విరమణ భారత్ ప్రతిపాదనే.. పాకిస్తాన్ సైన్యం బుకాయింపు
ఆపరేషన్ సిందూర్ కొనసాగుతున్న వేళ కాల్పుల విరమణను తాము ప్రతిపాదించలేదని పాకిస్తాన్ బుకాయించింది. భారత్ ప్రతిపాదననే తాము మన్నించామంది.

దిశ, నేషనల్ బ్యూరో: కాల్పుల విరమణ ఒప్పందాన్ని తాము ప్రతిపాదించలేదని, భారతే ప్రతిపాదించిందని పాకిస్తాన్ డీజీ ఐపీఎస్‌ఆర్ ఔరంగజేబ్ బుకాయించారు. తాము భారత్‌పై ప్రతిదాడి చేసి, తీవ్ర నష్టం కలిగించిన తర్వాతనే ఈ కాల్పుల విరమణకు ఒప్పుకున్నామని ఔరంగజేబ్ బీరాలు పలికారు. కొన్ని గంటల ముందే కాల్పుల విరమణను పాకిస్తాన్ ప్రతిపాదించిందని భారత డీజీఎంవోలు వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో తాము కూడా మీడియా సమావేశం పెట్టాలని భావించిన పాకిస్తాన్ సేనలు.. కాల్పుల విరమణను భారతే ప్రతిపాదించిందని బుకాయిస్తున్నాయి. పాకిస్తాన్ డీజీ ఐఎస్‌పీఆర్ ఔరంగజేబ్ తాము కాల్పుల విరమణను ప్రతిపాదించలేదని చెప్పారు. ‘మే 6-7 రాత్రి భారత్ దాడులు చేసింది. మేం ప్రతిదాడి చేసిన తర్వాతే మాట్లాడతామని వారికి స్పష్టంగా చెప్పాం. మే 10 తర్వాత అంతర్జాతీయ భాగస్వాముల మధ్యవర్తిత్వం వల్ల భారత్ అభ్యర్థనను మన్నించాం’ అన్నారు. ఇది గమనిస్తే.. భారత డీజీఎంవో చెప్పిన మాటలనే తనకు అనుకూలంగా పాక్ చెప్పుకున్నట్లు అర్థం అవుతుంది.
భారత్ ఏమన్నదంటే?
ఇదే విషయాన్ని లెఫ్టినెంట్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ ధ్రువీకరించారు. పాకిస్తాన్‌లోని ఉగ్రస్థావరాలను ధ్వంసం చేసిన తర్వాత పాక్ డీజీఎంవోకు తను స్వయంగా కాల్ చేసి ఇదే విషయం చెప్పేందుకు ప్రయత్నించామని, అయితే తాము ఎదురుదాడి చేసిన తర్వాతే మాట్లాడతామని పాక్ అన్నదని కూడా భారత డీజీఎంవో తెలిపారు. ఆ తర్వాత భారత్‌పై డ్రోన్లు, మిసైల్స్ దాడి చేసిన పాకిస్తాన్.. మే 10వ తేదీన కాల్ చేసి కాల్పుల విరమణను ప్రతిపాదించిందని ఘాయ్ వివరించారు.






