పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు

by velandi.Saikiran |

ఇండియాను ఉద్దేశించి పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశాడు.

పాక్ ఆర్మీ చీఫ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
X

దిశ‌, వెబ్ డెస్క్: భారత్, పాకిస్తాన్ మధ్య పరిస్థితులు ఏ మాత్రం బాగాలేవు. పహల్గామ్ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య గ్యాప్ మరింత పెరిగింది. అయితే ఇలాంటి నేపథ్యంలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్ తో చావు దెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ వాళ్లకు బుద్ధి రావడం లేదు. చీటికి మాటికి ఇండియాతో గొడవ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగానే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ హాట్ కామెంట్స్ చేసి, కుక్క తోక వంకరే అని నిరూపించాడు.

భవిష్యత్తులో తమ దేశంపై దాడి చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగే ప్రయత్నం చేశాడు. గత ఏడాది పాకిస్తాన్ సర్వబౌమత్వాన్ని ఉల్లంఘించడం ద్వారా సంకల్పాన్ని పరిరక్షించడానికి శత్రువు విఫల ప్రయత్నం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు అసిమ్ మునీర్. దానికి సైనిక శక్తితో బదులు ఇచ్చామని గొప్పలు చెప్పుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఫ్యూచర్ లో మళ్లీ పాకిస్తాన్ జోలికి వస్తే భయంకరమైన పరిస్థితులు ఉంటాయని వార్నింగ్ ఇచ్చాడు. ఇక అసిమ్ మునీర్ చేసిన వ్యాఖ్య‌ల‌కు ఇండియా నుంచి కూడా స్ట్రాంగ్ కౌంట‌ర్లు ఇస్తూనే ఉన్నారు.

Next Story