- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
J&K Lt Governor: జమ్ము యూనివర్సిటీలో నాటక ప్రదర్శనకు హాజరైన ఎల్జీ మనోజ్ సిన్హా
ఉగ్రవాదులను పెంచిపోషిస్తే పాక్ తన ఉనికిని తుడిచి పెట్టుకుపోతుందని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరించారు.

దిశ, నేషనల్ బ్యూరో: ఉగ్రవాదులను పెంచిపోషిస్తే పాక్ తన ఉనికిని తుడిచి పెట్టుకుపోతుందని జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా హెచ్చరించారు. జమ్ము యూనివర్సిటీలో ప్రముఖ కవి రాంధారి సింగ్ రచించిన రశ్మిరతి నాటక ప్రదర్శనకు ఆయన హాజరయ్యారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ గురించి ప్రస్తావించారు. ‘‘పాకిస్థాన్‌లోని ఉగ్రస్థావరాలపై దాడి చేసి మన బలగాలు ఆ దేశానికి గట్టి హెచ్చరికలు చేశాయి. ఇలాగే ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తే పాక్ భవిష్యత్తు తుడిచిపెట్టుకుపోతుంది. ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న ఆ దేశానికి తగిన శిక్ష పడుతుంది’’ అని పాక్ పై విమర్శలు గుప్పించారు. ఆపరేషన్ సిందూర్ ద్వారా "ఉగ్రవాద దేశం"పై బలమైన, నిర్ణయాత్మక చర్య తీసుకున్నందుకు సాయుధ దళాల శౌర్యం, అజేయ ధైర్యానికి ఆయన సెల్యూట్ చేశారు.
యువతపై ప్రశంసలు..
భారతదేశ స్థాపకులు కన్న కలలను నేటి యువత నిజం చేస్తున్నందుకు తనకు గర్వంగా ఉందని మనోజ్ సిన్హా అన్నారు. ప్రజాస్వామ్య విలువలను యువకులు కాపాడుతున్నారని, దేశ సార్వభౌమత్వాన్ని, సమగ్రతను రక్షించేందుకు కృషి చేస్తున్నారని ప్రశంసించారు. దేశానికి సేవచేసే అవకాశాన్ని యువత అందిపుచ్చుకోవాలని, దేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించాలని సిన్హా పిలుపునిచ్చారు. ఆర్మీ తరహాలో వారంతా ఆవిష్కరణలతో దేశ ఆర్థిక శక్తిని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. రశ్మిరతి అనేది కేవలం ఇతిహాసం మాత్రమే కాదని, ఇది ధర్మ విలువలకు చిహ్నమని పేర్కొన్నారు.






