Train Hijack : పాక్ రైలు హైజాక్.. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి

by Muthe.Rajitha |

పాకిస్థాన్(pakistan) లో జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు(Jaffar Express)ను బలూచిస్తాన్(Baluchistan) వేర్పాటు వాదులు మంగళవారం హైజాక్(Train Hijack) చేసిన విషయం తెలిసిందే.

Train Hijack : పాక్ రైలు హైజాక్.. రెస్క్యూ ఆపరేషన్ పూర్తి
X

దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్(pakistan) లో జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలు(Jaffar Express)ను బలూచిస్తాన్(Baluchistan) వేర్పాటు వాదులు మంగళవారం హైజాక్(Train Hijack) చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో యావత్ ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. రైల్లో ఉన్న సైనికులను హతమార్చి వేర్పాటు వాదులు దాదాపు 450 మంది బందీలను అదుపులోకి తీసుకొని , కొందరు ప్రయాణికులను, రైల్లో ఉన్న సైనికులను చంపేశారు. మహిళలు, పిల్లలు, వృద్ధులను వదిలేశారు. మిగతా వాళ్లను తమ వద్ద బందీలుగా ఉంచుకుకొని, జైలులో ఉన్న తమ వారిని విడుదల చేయడానికి అంగీకరిస్తే, తమ దగ్గరున్న ప్రయాణికులను విడుదల చేస్తామని, లేదంటే అందరినీ చంపేస్తామని హెచ్చరించారు.

అయితే ఈ డిమాండ్లను తిరస్కరించిన పాక్ ప్రభుత్వం, సైన్యాన్ని రంగం(Pak Army)లోకి దింపింది. దాదాపు రెండురోజులపాటు సాగిన ఈ రెస్క్యూ ఆపరేషన్లో ౩౦ మంది వేర్పాటు వాదులను మట్టుబెట్టి, బందీలను విడిపించామని పాక్ అధికారులు ప్రకటించారు. బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ చెరలో ఉన్న 300 మందికి పైగా బందీలను రక్షించినట్లు పేర్కొన్నారు. అయితే హైజాకర్లు పట్టుకున్న బందీల్లో కొందరు మరణించినట్లు వెల్లడించారు. అయితే వారి వివరాలు మాత్రం తెలియజేయలేదు. మీడియాకు ఆ వివరాలు తెలిపే అధికారం తమకు లేదని సదరు పాక్ అధికారులు పేర్కొన్నారు.

Next Story