- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్ రక్షణ మంత్రికి షాక్ ఇచ్చిన భారత్
పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్‌కు భారత్ షాక్ ఇచ్చింది. ఆయన ట్విట్టర్ ఖాతాను ఇండియాలో బ్లాక్ చేసింది.

దిశ, వెబ్ డెస్క్: పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా మహమ్మద్‌కు భారత్ షాక్ ఇచ్చింది. ఆయన ట్విట్టర్ ఖాతాను ఇండియాలో బ్లాక్ చేసింది. కశ్మీర్‌పై, పహల్గామ్ ఎటాక్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్న కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌ను సైతం ఇండియాలో బ్యాన్ చేసిన సంగతి తెలిసిందే. ఇండియాలోని పాక్ జర్నలిస్టుల ట్విట్టర్ ఖాతాలను కూడా బ్యాన్ చేశారు. ఈ క్రమంలోనే విద్వేశాలను రెచ్చగొడుతూ కశ్మీర్‌పై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తున్న ఖవాజా ట్విట్టర్ ఖాతాను సైతం భారత్ బ్లాక్ చేసింది.
ఐఎస్ఐ, పాకిస్థాన్ కలిసి ఈ చర్యలకు పాల్పడుతున్న నేపథ్యంలో భారత్ ఈ నిర్ణయం తీసుకుంది. ఇదిలా ఉంటే రక్షణ మంత్రి ఖవాజానే స్వయంగా ఉగ్రవాదాన్ని పోత్సహించినట్టు ఒప్పుకున్నారు. పహల్గామ్ ఘటన తరవాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బ్రిటన్, అమెరికా కోసమే ఈ చెత్త పనులు చేశామని, ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం పొరపాటు చేశామని అర్థం అయ్యిందంటూ పేర్కొన్నారు. ఉగ్రవాదుల చాలా ఇబ్బందులు పడ్డామని, ఉగ్రసంస్థలకు నిధులు నిజమేనని ఒప్పుకున్నారు.






