"నీళ్లు ఆపితే ఊపిరి ఆపుతాం.." సింధుజలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ అధికారి హెచ్చరిక

by Naga Rani Yarlagadda |

పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత ప్రభుత్వం పాక్‌కు సింధునదీ జలాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో పాక్‌లో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఈ విషయంపై పాక్ ఆర్మీ చీఫ్ అహ్మద్ షరీఫ్ తీవ్ర హెచ్చరికలు చేశారు.

నీళ్లు ఆపితే ఊపిరి ఆపుతాం.. సింధుజలాలపై భారత్‌కు పాక్ ఆర్మీ అధికారి హెచ్చరిక
X

దిశ, వెబ్‌డెస్క్: పహల్గామ్ ఉగ్రదాడి (Pahalgam Terror Attack) తర్వాత భారత ప్రభుత్వం పాక్‌కు సింధునదీ జలాలను నిలిపివేసిన విషయం తెలిసిందే. దీంతో పాక్‌లో తీవ్ర నీటి ఎద్దడి పరిస్థితులు నెలకొన్నాయి. తాజాగా ఈ విషయంపై పాక్ ఆర్మీ చీఫ్ అహ్మద్ షరీఫ్ చౌదరి తీవ్ర హెచ్చరికలు చేశారు. తమకు సింధునదీ జలాలను ఆపితే.. భారత్ లో ప్రజల ఊపిరి ఆపుతామని చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. గతంలో లష్కరే తోయిబాకు చెందిన ఉగ్రవాదం హఫీజ్ సయీద్ సైతం ఇలాంటి వ్యాఖ్యలే చేయగా.. ఇప్పుడు షరీఫ్ సైతం ఆ వ్యాఖ్యల్నే పునరుద్ఘాటించడం చర్చనీయాంశమైంది.

తాజాగా పాక్ లో జరిగిన ఒక సభలో మాట్లాడిన ఆయన.. మా నీళ్లు ఆపితే.. మీ ఊపిరి ఆపుతాం అని భారత్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసినట్లు పలు జాతీయ, అంతర్జాతీయ మీడియా సంస్థలు కథనాల్లో పేర్కొన్నాయి. ఉగ్రవాదాన్ని ఆపేంతవరకూ సింధు జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు భారత్ మొదట్లోనే చెప్పింది. మళ్లీ ఉగ్రవాదానికి ఊతమిచ్చేలా పాక్ ఆర్మీ అధికారే ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మళ్లీ దాడులు జరిగే ఛాన్స్ ఉందన్న సంకేతాలిస్తోందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్.. పాక్ ఆర్మీచీఫ్ జనరల్ అసిమ్ మునీర్ కు ఫీల్డ్ మార్షల్ హోదా కల్పించడంపై వ్యంగ్యమైన వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఆటవిక రాజ్యం నడుస్తుందని, మునీర్ కు రాజు బిరుదు ఇచ్చి ఉంటే ఇంకా బాగుండేదని ఎద్దేవా చేశారు. భారత్ మరోసారి దాడులు చేసే అవకాశం ఉందని, ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Next Story