CM Devendra Fadnavis : పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న మహారాష్ట్ర ప్రభుత్వం

by Muthe.Rajitha |

జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో ఉగ్రవాదులు 28 మంది టూరిస్టులను కాల్చిచంపిన సంగతి తెలిసిందే.

CM Devendra Fadnavis : పహల్గాం ఉగ్రదాడి.. బాధితులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్న మహారాష్ట్ర ప్రభుత్వం
X

దిశ, వెబ్ డెస్క్ : జమ్మూకశ్మీర్లోని పహల్గాం ఉగ్రదాడి(Pahalgam Terror Attack)లో ఉగ్రవాదులు 28 మంది టూరిస్టులను కాల్చిచంపిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో మృతిచెందిన వారి కుటుంబాలకు సహాయం అందించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Govt) ప్రత్యేక ఆర్థిక సహాయాన్ని(Special Financial Assistance) ప్రకటించింది. ఈ మేరకు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్(CM Devendra Fadnavis) నేతృత్వంలో నేడు జరిగిన మంత్రిమండలి సమావేశంలో ప్రత్యేక ఆర్థిక సహాయ పథకానికి ఆమోద ముద్ర వేశారు. ఈ పథకం కింద, మృతిచెందిన ప్రతి వ్యక్తి కుటుంబానికి 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయంతోపాటు, కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అందిస్తామని ప్రభుత్వం పేర్కొంది. ముఖ్యమంత్రి విశేషాధికారం ద్వారా తీసుకున్న ఈ నిర్ణయం.. బాధిత కుటుంబాలకు ఆర్థిక భద్రత, జీవనోపాధిని కల్పించే లక్ష్యంతో రూపొందించబడిందని అధికారులు పేర్కొన్నారు.

Next Story