పహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం.. చార్జిషీట్ లో లష్కర్ ఏ తోయిబా చీఫ్ పేరు

by Prasad Jukanti |

పహల్గామ్ ఉగ్రదాడి కేసులో లష్కరే తోయిబా చీఫ్ హఫీజ్ సయీద్‌పై ఎన్‌ఐఏ అదనపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. భారత్‌పై యుద్ధం ప్రకటించినట్లుగా అభియోగాలు మోపింది.

పహల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం.. చార్జిషీట్ లో లష్కర్ ఏ తోయిబా చీఫ్ పేరు
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేశంలో తీవ్ర విషాదం నింపిన ఏప్రిల్ 2025 పహెల్గాం ఉగ్రదాడి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో లష్కరే తోయిబా (LeT), దాని అనుబంధ 'ది రెసిస్టెన్స్ ఫ్రంట్' (TRF) వ్యవస్థాపకుడు, చీఫ్ హఫీజ్ సయీద్‌పై పేరును ఎన్ఐఏ చార్జిషీట్‍లో చేర్చింది. ఈ కేసులో సోమవారం జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) సోమవారం అదనపు ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది. జమ్మూలోని ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టులో సమర్పించిన ఈ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో హఫీజ్ సయీద్‌ను వ్యక్తిగత హోదాలోనూ, అలాగే నిషేధిత ఉగ్రవాద సంస్థ LeT/TRF చీఫ్‌గానూ ఎన్‌ఐఏ నిందితుడిగా చేర్చింది.

భారత్‌పై యుద్ధం ప్రకటించినట్లుగా గుర్తింపు

సయీద్‌పై భారతీయ న్యాయ సంహిత (BNS)-2023, చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA)-1967 లోని పలు కఠినమైన సెక్షన్ల కింద ఎన్‌ఐఏ అభియోగాలు మోపింది. సరిహద్దు అవతలి నుంచి భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం ప్రకటించడం, ఉగ్ర కుట్రలు పన్నడం వంటి నేరాలకు సంబంధించిన సెక్షన్లను కూడా ఈ ఛార్జ్‌షీట్‌లో చేర్చారు. గతంలో దాఖలు చేసిన 1,597 పేజీల ప్రధాన ఛార్జ్‌షీట్‌కు కొనసాగింపుగా ఈ అదనపు ఛార్జ్‌షీట్‌ను ఎన్‌ఐఏ దాఖలు చేసింది. ఇందులో పాకిస్తాన్ పన్నిన కుట్రలు, హఫీజ్ సయీద్ కీలక పాత్ర, మరియు క్షేత్రస్థాయి విచారణ, శాస్త్రీయ ఆధారాలను ఎన్‌ఐఏ పక్కాగా పొందుపరిచింది. కాగా, 22 ఏప్రిల్ 2025న జమ్మూ కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో పాక్ మద్దతు ఉన్న ఉగ్రవాదులు మత ప్రాతిపదికన టార్గెట్ చేసి దారుణ ఊచకోతకు పాల్పడ్డారు. ఈ దాడిలో 25 మంది అమాయక పర్యాటకులు, ఒక స్థానిక పౌరుడు ప్రాణాలు కోల్పోయారు.

Next Story