- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
India alliance: కాంగ్రెస్ ను రాహుల్ పక్కనున్నవాళ్లే నమ్మడం లేదు.. ఇండియా కూటమిపై బీజేపీ సెటైర్లు
ఇండియా కూటమి భవిష్యత్ పై పి. చిదంబరం లేవనెత్తిన సందేహాలపై బీజేపీ సెటైర్లు వేస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే కూటమిని ఎదుర్కోవడమే లక్ష్యంగా గత లోక్ సభ ఎన్నికలకు ముందు ఏర్పాటైన 'ఇండియా' కూటమిపై (India Alliance) కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం (P.Chidambaram) చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో చర్చనీయాశంగా మారాయి. ఇండియా కూటమిలో లుకలుకలు ఉన్నాయని ఈ కూటమి భవిష్యత్తు అంతా ఉజ్వలంగా ఉన్నట్లు కనిపించడం లేదని ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్ష కూటమిలో హాట్ టాపిక్ గా మారాయి. గురువారం కాంగ్రెస్ నాయకుడు సల్మాన్ ఖుర్షీద్ సహ రచయితగా రాసిన 'కాంటెస్టింగ్ డెమోక్రటిక్ డెఫిసిట్' అనే పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో పి. చిదంబరం ఇండియా కూటమి భవితవ్యంపై తనకున్న అనిశ్చితిని అంగీకరించారు. ఇండియా కూటమి అతుకులు కదులుతున్నట్టు దారాలు ఊడిపోతున్నట్లు కనిపిస్తోందని అయితే దీన్ని సరిదిద్దుకోవచ్చు. ఇందుకు ఇంకా సమయం ఉందని అన్నారు. ఎన్డీయే కూటమి తరచూ సమావేశమవుతూ వ్యూహరచన చేస్తుంటే ఇండియా కూటమిలో అలాంటి ప్రయత్నాలు కొరవడ్డాయన్నారు. చిదంబరం చేసిన ఈ వ్యాఖ్యలు జాతీయ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ కాంగ్రెస్ పై (Congress) సెటైర్లు వేస్తోంది.
కాంగ్రెస్ కు భవిష్యత్ లేదు: బీజేపీ
కాంగ్రెస్ కు భవిష్యత్ లేదని రాహుల్ గాంధీ (Rahul Gandhi) సన్నిహితులకు కూడా తెలుసు అని చిదంబరం వ్యాఖ్యలపై బీజేపీ (BJP) అధికార ప్రతినిధి ప్రదీప్ బండారి విమర్శలు గుప్పించారు. ఎక్స్ వేదికగా స్పందించిన ఈయన భవిష్యత్ లోనూ ప్రతిపక్షం చెక్కు చెదరబదని బీజేపీ బలంగా ఉందని చిదంబరం జోస్యం చెప్పారన్నారు.






