- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Ukraine: మూడ్రోజుల్లో 900 డ్రోన్ల దాడులు- జెలెన్ స్కీ
ఉక్రెయిన్ పై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామాలు రష్యా-ఉక్రెయిన్ (Ukraine-Russia War) ఉద్రిక్తతలను పెంచాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఉక్రెయిన్ పై రష్యా దాడులు తీవ్రతరం చేసింది. కాల్పుల విరమణ కోసం చర్చలు జరుగుతున్న వేళ ఈ పరిణామాలు రష్యా-ఉక్రెయిన్ (Ukraine-Russia War) ఉద్రిక్తతలను పెంచాయి. కాగా.. వీటిపై ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ (Zelensky) స్పందించారు. గత మూడు రోజులుగా తమ దేశంపై క్షిపణులతో పాటు 900లకు పైగా డ్రోన్లతో దాడులు జరిగాయన్నారు. మాస్కో నేతలతో ఇస్తాంబుల్‌లో శాంతి చర్చలు జరుపుతున్నప్పటికీ.. దాడులు ఆగడంలేదని ఆరోపించారు. యుద్ధం ఆపాలనే ఆలోచన పుతిన్ కి లేదని తెలుస్తోందన్నారు. కీవ్‌పై మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధం అవుతున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించినట్లు జెలెన్‌స్కీ పేర్కొన్నారు. అయితే, ఇటీవలే జరిగిన భారీ వైమానిక దాడుల్లో ఉక్రెయిన్‌లోని ఐదు ప్రదేశాలు, పలు వాణిజ్య, నివాస భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయని తెలిపారు. మిలిటరీ స్థావరం ఉన్న పశ్చిమ ఖ్మెల్నిట్స్కీ ప్రాంతంపై రష్యా ఏడు క్రూయిజ్ మిస్సైల్స్, పెద్ద మొత్తంలో డ్రోన్లను ప్రయోగించిందని అన్నారు. ఇకనైనా దాడులకు పాల్పడకుండా రష్యాను కట్టడి చేసేందుకు అమెరికా, యూరప్‌లు ఆ దేశంపై కఠిన ఆంక్షలు విధించాలని కోరారు.
యుద్ధ ఖైదీల అప్పగింత..
యుద్ధ ఖైదీల అప్పగింతలో భాగంగా శుక్రవారం రష్యా-ఉక్రెయిన్ 390 మందిని, శనివారం 307 మందిని ఇరుదేశాలు మార్పిడి చేసుకున్నాయి. అయితే, ఇప్పుడు మరో 303 సైనికులను పరస్పరం అప్పగించుకున్నట్లు రష్యా రక్షణశాఖ వెల్లడించింది. మరోవైపు కీవ్‌తోపాటు ఇతర ప్రాంతాలపై మాస్కో భీకర దాడులు చేస్తోంది. ఆదివారం రాత్రి ఒకేరోజు 69 క్షిపణులతో పాటు 298 డ్రోన్లలో విరుచుకుపడింది. వీటిలో ఇరాన్ రూపొందించి షాహిద్ డ్రోన్లు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తంగా ఈ దాడుల్లో 12 మంది చనిపోగా.. పలువురు గాయాలపాలయ్యారు. మరోవైపు, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా ఈ దాడులపైస్పందించారు. పుతిన్ పిచ్చిపట్టినవాడిలా ప్రవర్తిస్తున్నాడని విమర్శించారు. ఉక్రెయిన్ మొత్తం స్వాధీనం చేసుకోవాలని ఆయన ఆలోచిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా, జెలెన్ స్కీ మాటాల వల్లే ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయని మండిపడ్డారు.






