- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Illegal Immigrants: మోడీ ఇలాకాలో భారీ ఆపరేషన్.. 550 మందికిపైగా అక్రమ వలసదారుల అరెస్టు
దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల ఏరివేత కొనసాగుతున్నది.

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడి తర్వాత దేశవ్యాప్తంగా అక్రమ వలసదారుల (illegal immigrants) ఏరివేత కొనసాగుతోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వాలు పలు నగరాల్లో స్పెషల్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నాయి. అక్రమంగా దేశంలో ప్రవేశించి ఇక్కడే తిష్టవేసిన వారి భరతం పడుతున్నాయి. ఇవాళ తెల్లవారుజామున అహ్మదాబాద్ నగరంలో గుజరాత్ (Gujarat) పోలీసులు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్ లో 550 మందికి పైగా అక్రమంగా ఉంటున్న విదేశీయులను అరెస్ట్ చేశారు. వారంతా చట్టవిరుద్ధంగా భారత్ లోకి ప్రవేశించి ఇక్కడ నివసించేందుకు నకిలీ పత్రాలు సృష్టించుకున్నారని అధికారులు తెలిపారు. దర్యా్ప్తు చేపట్టిన తర్వాత వారిని తిరిగి బంగ్లాదేశ్ కు పంపిస్తామని అధికారులు తెలిపారు. మరో వైపు పాకిస్తాన్ పౌరులంతా దేశం విడిచి వెళ్లిపోవాలని కేంద్ర ప్రభుత్వం అల్టిమేటం జారీ చేసిన నేపథ్యంలో రాష్ట్రంలో ఏ పాకిస్తానీ జాతీయుడు ఉండకుండా చూసుకోవాలని హర్యానా ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ ఆ రాష్ట్ర డిప్యూటీ కమిషనర్లు, ఎస్పీలకు ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ సైతం పాకిస్తాన్ పౌరుల పై దృష్టి సారించింది. హైదరాబాద్ లోనే పాకిస్తాన్ కు చెందిన పౌరులు 208 మంది ఉన్నట్లు అధికారులు గుర్తించగా వారంతా గడువులోగా వెళ్లిపోవారని నోటీసులు జారీ చేశారు. మిగతా రాష్ట్రాల్లోనూ పాకిస్తాన్ పౌరులు, అక్రమ వలసదారులపై వేట కొనసాగుతోంది.






