గల్ఫ్ నుంచి భారత్‌కు చేరిన‌ 52 వేల మంది

by velandi.Saikiran |   (  Updated:2026-03-08 00:48:10  IST  )

మార్చి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు దాదాపు 52,000 మంది గల్ఫ్ నుంచి మన భారతదేశానికి తిరిగి వచ్చినట్లు స్పష్టం చేసింది.

గల్ఫ్ నుంచి భారత్‌కు చేరిన‌ 52 వేల మంది
X

దిశ‌, వెబ్ డెస్క్: ఇరాన్, ఇజ్రాయిల్- అమెరికా మధ్య యుద్ధం జరుగుతున్న సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే ఇరాన్ పై ఇజ్రాయిల్ దాడి చేస్తుంటే, ఇరాన్ మాత్రం చాలా భిన్నంగా ముందుకు వెళ్తోంది. పశ్చిమ ఆసియా గల్ఫ్ దేశాలను టార్గెట్ చేస్తూ దాడులు చేస్తోంది ఇరాన్. దీంతో గల్ఫ్ దేశాలలో ఉన్న మన ఇండియన్స్ గజగజ వణికి పోతున్నారు.

ఇందులో భాగంగానే పశ్చిమ ఆసియా, గల్ఫ్ లో ఉంటున్న మన భారతీయులు, వెనక్కి వస్తున్నారు. దానికి తగ్గట్టుగానే గల్ఫ్ లో ఉన్న పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తోంది భారత విదేశాంగ శాఖ. ఎయిర్ స్పేస్ పాక్షికంగా తెలుసుకోవడంతో ఎయిర్ లైన్స్ సంస్థలు కమర్షియల్ ఫ్లైట్స్ నడుపుతున్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో మార్చి ఒకటో తేదీ నుంచి ఏడో తేదీ వరకు దాదాపు 52,000 మంది గల్ఫ్ నుంచి మన భారతదేశానికి తిరిగి వచ్చినట్లు స్పష్టం చేసింది. విమానాలు అందుబాటులో లేని వాళ్ళు సమాచారం కోసం ఎంబసీ లేదా కాన్సులేట్ ను సంపాదించాలని పేర్కొంది. హెల్ప్ లైన్ నెంబర్లు కూడా విడుదల చేసింది విదేశాంగ శాఖ.

Next Story