‘మా ప్రధాని పిరికిపంద’.. పార్లమెంట్‌లో రెచ్చిపోయిన పాక్ ఎంపీ

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-09 10:25:06  IST  )

భారత్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీలు పాకిస్థాన్ పై విరుచుకుపడ్డాయి.

‘మా ప్రధాని పిరికిపంద’.. పార్లమెంట్‌లో రెచ్చిపోయిన పాక్ ఎంపీ
X

దిశ,వెబ్‌డెస్క్: భారత్, బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీలు పాకిస్థాన్ పై విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో పాక్ నాయకులు వారి ప్రధాని షెహబాజ్ షరీఫ్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. పాకిస్తాన్ పై దాడి చేసినట్లు బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అధికారికంగా ప్రకటన చేసిన చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పాకిస్తాన్ లోని మొత్తం ఆరు స్థావరాలలో దాడులు చేసినట్లు తెలిపింది.

ఈ క్రమంలో పార్లమెంట్‌లో కూడా పాకిస్థాన్ ప్రధాని పై ఆ దేశ ఎంపీలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. పాక్ పార్లమెంట్‌లోనే పాకిస్తాన్ ప్రధానిని, ఆర్మీ చీఫ్‌ను తిడుతూ ఓ ఎంపీ బూతులతో రెచ్చిపోయారు. యుద్ధాన్ని ఎదుర్కొలేక పిరికిపందల్లా దాక్కున్నారని వారిపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే భారత్–పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి అక్కడి ప్రజలు మరో షాక్ ఇచ్చారు. రోడ్లపై నిరసన తెలుపుతున్నారు. పాకిస్తాన్(Pakistan) ప్రధాని షరీఫ్ విఫలమయ్యారని ఈ పాలన తమకు వద్దని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Next Story