- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేరళ వేదికగా ఆర్గాన్ ట్రాఫికింగ్.. NIA విచారణలో సంచలన విషయాలు
కేరళ వేదికగా జరిగిన ఆర్గాన్ ట్రాఫికింగ్ ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA) సంచలన విషయాలను రాబట్టింది.

దిశ, వెబ్ డెస్క్: కేరళ వేదికగా జరిగిన ఆర్గాన్ ట్రాఫికింగ్ (Organ trafficking) ఇటీవల వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన జాతీయ దర్యాప్తు సంస్థ ( NIA) సంచలన విషయాలను రాబట్టింది. ఇరాన్‌తో పాటు తజికిస్థాన్‌కు కూడా ఈ ముఠా అక్రమంగా మనుషులను తరలించినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ ఏడాది ఒడిశాకు చెందిన ఇద్దరు వ్యక్తులను అవయవ దానం కోసం తజికిస్థాన్‌కు పంపినట్లు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో మొదటి నిందితుడైన మధు జయకుమార్‌ను విచారణ నిమిత్తం కస్టడీకి కోరుతూ ఎన్‌ఐఏ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఈ వివరాలను పొందుపరిచింది.
2024 మే 18న కొచ్చి విమానాశ్రయంలో సాబిత్ అనే వ్యక్తిని ఇమ్మిగ్రేషన్ అధికారులు అడ్డుకోవడంతో ఈ వ్యవస్థీకృత నేరం బయటపడింది. నిందితులు అమాయకులను ప్రలోభపెట్టి విదేశాలకు తరలించి అక్రమంగా అవయవ మార్పిడి దందాను నిర్వహిస్తున్నట్లు అధికారులు నిర్ధారించారు. ప్రస్తుతం ఈ అంతర్జాతీయ నెట్‌వర్క్‌కు సంబంధించి ఇతర రాష్ట్రాల లింకులను, అలాగే ఈ దందాలో ఉన్న మరికొంతమంది కీలక సభ్యులను పట్టుకునేందుకు ఎన్‌ఐఏ లోతుగా దర్యాప్తు చేస్తోంది.






