- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమిత్ షాకు మోడీ ఫోన్.. పేలుడుపై విచారణకు ఆదేశం
ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పేలుడు(Delhi Explosion) ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీలోని ఎర్రకోట వద్ద చోటుచేసుకున్న పేలుడు(Delhi Explosion) ఘటన దేశ వ్యాప్తంగా కలకలం రేపింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో ప్రజలు చనిపోవడం, 30 మందికిపైగా తీవ్రంగా గాయపడటం అందరినీ కలచివేస్తోంది. ఈ పేలుడు ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు మోడీ ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు పేలుడు ఘటనపై అమిత్ షా విచారణకు ఆదేశించారు. ఎన్ఐఏ, ఎన్‌ఎస్‌జీ, ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ దర్యాప్తునకు ఆదేశించారు. 2011లో ఢిల్లీ హైకోర్టు దగ్గర జరిగిన పేలుళ్లు, అంటే దాదాపు 14 సంవత్సరాల తరవాత ఢిల్లీలో మళ్లా పేలుళ్లు జరగడం ఇదే. టెర్రరిస్టుల పనే అయి ఉంటుందని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఢిల్లీ పోలీసులతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మాట్లాడుతున్నారు. దరియా గంజ్ నుంచి ఎర్రకోట వరకు వాహనాల రాకపోకలు నిలిపివేశారు. ఢిల్లీ స్పెషల్ సెల్ టీం, క్లూస్ టీంలు, ఫోరెన్సిక్ నిపుణులు సంఘటనా స్థలం నుంచి శాంపిల్స్ సేకరిస్తున్నారు.






