- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
లోక్‌సభలో మూడు బిల్లులను వ్యతిరేకించిన విపక్షాలు.. ఆందోళనతో వాయిదా
లోక్‌సభలో విపక్షాల ఆందోళనతో గందరగోళం నెలకొంది. మంగళవారం కేంద్రం సభలో మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టగా.. విపక్షాలు మూడింటినీ వ్యతిరేకించాయి.

దిశ, వెబ్ డెస్క్: లోక్‌సభలో విపక్షాల ఆందోళనతో గందరగోళం నెలకొంది. మంగళవారం కేంద్రం సభలో మూడు బిల్లుల్ని ప్రవేశపెట్టగా.. విపక్షాలు మూడింటినీ వ్యతిరేకించాయి. కేంద్రమంత్రి అమిత్ షా పై పేపర్లు చించి విసిరేయడంతో సభలో గందరగోళం నెలకొంది. ఆన్ లైన్ గేమింగ్ బిల్లు, ప్రధాని ముఖ్యమంత్రుల ఉద్వాసన బిల్లు, జమ్ముకశ్మీర్ రాష్ట్ర హోదా బిల్లును సభలో ప్రవేశపెట్టగా విపక్షాలు ఆందోళన చేపట్టాయి. అధికార, విపక్షాల సభ్యుల మధ్య మాటల యుద్ధం జరగుతుండటంతో.. స్పీకర్ సభను మధ్యాహ్నం 3 గంటలకు వాయిదా వేశారు.
ఆన్ లైన్ గేమింగ్ ప్రమోషన్ అండ్ నియంత్రణ బిల్లును కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ ప్రవేశపెట్టగా.. జమ్మూకశ్మీర్ పునర్వ్యవస్థీకరణ సవరణ బిల్లు, 130వ రాజ్యాం సవరణ బిల్లును కేంద్ర హోంమంత్రి అమిత్ షా సభలో ప్రవేశపెట్టారు. ఈ మూడు బిల్లుల్నీ విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడంతో పాటు.. కేంద్రానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 130వ రాజ్యాంగ సవరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపుతామని హోంమంత్రి అమిత్ షా తెలిపారు.






