లోక్‌సభలో విపక్ష సభ్యుల రచ్చ.. సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా

by Kema Shiva Kumar |

పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విపక్షాలు పహల్గాం టెర్రర్ అటాక్ (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), బిహార్ ఓటర్ జాబితాపై చర్చించాలని వాయిదా తీర్మానాలు అందజేశాయి.

లోక్‌సభలో విపక్ష సభ్యుల రచ్చ.. సభను వాయిదా వేసిన స్పీకర్ ఓం బిర్లా
X

దిశ, వెబ్‌డెస్క్: పార్లమెంట్ (Parliament) వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన నేపథ్యంలో విపక్షాలు పహల్గాం టెర్రర్ అటాక్ (Pahalgam Terror Attack), ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor), బిహార్ ఓటర్ జాబితాపై చర్చించాలని వాయిదా తీర్మానాలు అందజేశాయి. సభ ప్రారంభం కాగానే శివసేన యూబీటీ సభ్యురాలు ఎంపీ ప్రియాంక చుతుర్వేది, కాంగ్రెస్ ఎంపీ మాణిక్కం ఠాగూర్ (Manickam Tagore) పహల్గాం టెర్రర్ అటాక్ విషయంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం, టెర్రరిస్టులను అరెస్ట్ చేయకపోడంపై చర్చించాలని పట్టుబట్టారు. అదేవిధంగా పహల్గాం టెర్రర్ అటాక్‌పై ప్రధాని మోడీ జవాబు చెప్పాలని డీఎంకే ఎంపీ టీఆర్ బాలు డిమాండ్ చేశారు.

అయితే, ఆ ప్రశ్నలకు ప్రధాని ఎప్పుడో సమాధానం చెప్పారని బీజేపీ ఎంపీ దామోదర్ అగర్వాల్ (MP Damodar Agarwal) బదులిచ్చారు. దీంతో చర్చకు పట్టుబడుతూ.. విపక్షాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం స్పీకర్ ఓం బిర్లా (Speaker Om Birla) కలుగుజేసుకుని ప్రశ్నోత్తరాల తర్వాత ఆపరేషన్ సిందూర్‌పై చర్చిద్దామని బదులిచ్చారు. ప్రశ్నోత్తరాల తర్వాతే ఎవరైన తనకు వాయిదా తీర్మానాలు ఇవ్వాలని స్పష్టం చేశారు. అన్ని అంశాలపై సావధానంగా చర్చిద్దామని ఆయన విపక్ష సభ్యులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయినా.. వారు చర్చకు పట్టుబడుతూ నినాదాలు చేస్తుండటంతో స్పీకర్ ఓం బిర్లా మధ్యాహ్నం 12 గంటల వరకు సభను వాయిదా వేస్తున్నట్లుగా ప్రకటించారు.

Next Story