Operation Sinduru: దాడులు ఆపాలని భారత్ ను కోరిన మాట వాస్తవం: పాక్ డిప్యూటీ పీఎం

by Prasad Jukanti |

ఆపరేషన్ సిందూర్ వేళ దాడులు ఆపాలని భారత్ ను కోరిన మాట వాస్తవం అని పాక్ డిప్యూటీ పీఎం అంగీకరించారు.

Operation Sinduru: దాడులు ఆపాలని భారత్ ను కోరిన మాట వాస్తవం: పాక్ డిప్యూటీ పీఎం
X

దిశ, డైనమిక్ బ్యూరో: పహెల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా ఆపరేషన్ సిందూర్ తో (Operation Sindoor) పాకిస్తాన్ కు భారత్ గట్టి బుద్ధి చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఆపరేషన్ సిందూర్ పీక్స్ లో ఉన్న వేళ ఇరు దేశాల మధ్య కాల్పుల విరమణ అంగీకారం రాజకీయంగా చర్చకు దారి తీసింది. ఇటువంటి పరిస్థితుల్లో తాజాగా కాల్పుల సీజ్ ఫైర్ విషయంలో పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ (Ishaq Dar) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆపరేషన్ సిందూర్ సమయంలో తమపై దాడులు ఆపాలని భారత్ ను తాము కోరిన మాట వస్తావమేనని పాక్ ఉప ప్రధాని ఇషాక్ దార్ అంగీకరించారు. ఓ టీవీ చానల్ తో మాట్లాడిన ఆయన.. భారత్ నూర్ ఖాన్, షోర్ కోట్ వైమానిక స్థావరాలపై దాడి చేసిందని తెలిపారు. దీంతో మాపై దాడి ఆపాలని భారత్ ను అడిగామని ఇందుకోసం సౌదీ యువరాజు ఫైజల్ ఫోన్ కాల్ ద్వారా భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ తో సంప్రదింపులు చేశామని వివరణ ఇచ్చారు. కాగా ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గడానికి తన జోక్యమే కారణం అని మొన్నటి వరకు ప్రకటించుకున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సైతం నిన్న ఇరు దేశాల కాల్పుల విరమణలో నా ప్రమేయం లేదని అంగీకరించిన సంగతి తెలిసిందే. పాక్ విషయంలో భారత్ ఎవరి మధ్యవర్తిత్వాన్ని అంగీకరించదని, మా దాడులను తట్టుకోలేక పాకిస్థాన్ కాళ్లబేరానికి వస్తేనే కాల్పుల విరమణకు అంగీకరించామని ఇప్పటికే ప్రధాని మోడీ చెప్పిన సంగతి తెలిసిందే.

Next Story