- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Operation Sindoor: ఒకే దెబ్బకు పాకిస్థాన్, చైనా హడల్...బలూచిస్థాన్ ఆర్మీ కంట్రోల్ లోకి గ్వాదర్ పోర్టు ?
operation Sindoor: భారతదేశం చేస్తున్న ముప్పేట దాడికి అటు పాకిస్తాన్, చైనా రెండు టార్గెట్ అవుతున్నాయి.

దిశ, వెబ్ డెస్క్: Operation Sindoor: భారతదేశం చేస్తున్న ముప్పేట దాడికి అటు పాకిస్తాన్, చైనా రెండు టార్గెట్ అవుతున్నాయి. పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు పహల్గాంలో 26 మంది అమాయక టూరిస్టుల ప్రాణాలను బలిగొన్న పాపానికి, ఇప్పటికే ఆపరేషన్ సింధూర్ పేరిట ప్రతీకార జ్వాలకు మాడి మసైపోయింది. మరోవైపు పాకిస్తాన్ కక్కలేక మింగలేక అన్న పరిస్థితికి వచ్చింది. ఎందుకంటే భారత్ చేసిన దాడుల వల్ల ప్రపంచానికి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో సాగుతున్న ఉగ్రవాద శిబిరాల గురించి బయటపడింది.
ఆ ఉగ్రవాద శిబిరాలను పాకిస్తాన్ సైన్యం, గూడచారి సంస్థ ఐఎస్ఐ దగ్గరుండి ప్రోత్సహించి నడిపిస్తున్నాయి. ఇంతకాలం ప్రపంచానికి పాకిస్తాన్ కొనసాగిస్తున్న ఈ ఉగ్రవాద శిబిరాల గురించి భారత్ అనేక అంతర్జాతీయ వేడుకల్లో బయటపెట్టే ప్రయత్నం చేసినప్పటికీ పెద్దగా ఫలితం రాలేదు. ఇప్పుడు ఆ ఉగ్రవాద శిబిరాలను టార్గెట్ చేసి క్షిపణుల దాడులు చేయడంతో, పాటు భారత వైమానిక దళం తాము పాకిస్తాన్ సైనిక పోస్టులు కానీ, పౌర నివాసాలపై కానీ దాడులు చేయలేదని, కేవలం ఉగ్రవాద శిబిరాలపై మాత్రమే దాడులు చేశామని సాక్షాలతో సహా యావత్ ప్రపంచానికి చూపించింది. దీంతో దీంతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో సాగుతున్న అక్రమాలు యావత్ ప్రపంచం ముందు బయటపడ్డాయి.
ఇప్పుడు పాకిస్తాన్ కు కొత్త తలనొప్పి మొదలైంది అదే గ్వాదర్ పోర్ట్ పోర్టు, అరేబియా సముద్రానికి తీరంలో ఉన్నటువంటి గ్వాదర్ పోర్ట్, బలూచిస్తాన్ భూభాగంలో ఉంది. ఈ ఓడరేవును చైనా నిర్మించింది. పశ్చిమాసియా దేశాలతో వాణిజ్యం చేసేందుకు చైనాకు ఈ ఓడరేవు ఎంతో కీలకమైనది. ఇక్కడ నుంచి చైనా భూభాగంలోకి పాకిస్తాన్ గుండా ప్రవేశించే China–Pakistan Economic Corridor (CPEC) కు అత్యంత కీలకమైన పోర్టు ఇది.
ప్రస్తుతం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కనుక ఈ ఓడరేవును ఆధీనంలోకి తీసుకుంటే మాత్రం, పాకిస్తాన్ తో సహా చైనాకు కూడా ఎదురు దెబ్బ తగలడం ఖాయమని. నిపుణులు పేర్కొంటున్నారు. ఇప్పటికే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి భారత్ వత్తాసు పలుకుతోందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారత్ మాత్రం దీనిపై ఎలాంటి స్పందన తెలపడం లేదు.
మరోవైపు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పై జరిగిన ఆపరేషన్ సింధూర్ అనంతరం బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ సభ్యులు సంబరాలు జరుపుకున్నట్లు వీడియోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మీ నేపథ్యంలో కీలకమైన గ్వాదర్ పోర్టు కనుక బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ కబ్జాలోకి వెళితే మాత్రం పాకిస్తాన్ కు తీవ్రమైన ఎదురు దెబ్బ తగలడం ఖాయమని విదేశాంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.






