Operation Sindoor:ఇండియా-పాక్ ఉద్రిక్తత పరిస్థితులు.. ఆ నినాదంతో కార్టూన్ వైరల్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-09 08:46:53  IST  )

జమ్మూకాశ్మీర్‌(Jammu and Kashmir)లోని పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

Operation Sindoor:ఇండియా-పాక్ ఉద్రిక్తత పరిస్థితులు.. ఆ నినాదంతో కార్టూన్ వైరల్!
X

దిశ,వెబ్‌డెస్క్: జమ్మూకాశ్మీర్‌(Jammu and Kashmir)లోని పహల్గాం ఉగ్ర దాడికి ప్రతీకారంగా భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాకిస్తాన్ ఉగ్ర స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో భారత్- పాక్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మరోసారి తీవ్ర స్థాయికి చేరాయి. భారత్, పాక్ మధ్య కాల్పులు, వైమానిక దాడులు చోటుచేసుకుంటున్నాయి. భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రముఖ డెయిరీ సంస్థ అమూల్ తాజాగా ఓ కార్టూన్ విడుదల చేసింది.

భారత సైనికులకు వందనం చేస్తున్నట్లు ఉన్న ఈ కార్టూన్ చూస్తే దేశభక్తి ఉట్టిపడుతుంది. ఈ నేపథ్యంలో అమూల్ సంస్థ తన అధికారిక ఎక్స్ ఖాతాలో, "#Amul Topical: The India-Pakistan conflict" అనే క్యాప్షన్‌తో ఒక డూడుల్‌ను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. ఈ డూడుల్‌లో ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు రాసి ఉన్నాయి. అవి ఏంటంటే.. "Send them pakking" అని రాసి ఉంది. అలాగే "Amul proudly Indian" అనే నినాదంతో దేశభక్తిని చాటుతూ ప్రజల హృదయాలను గెలుచుకుంటుంది.

ఈ కార్టూన్‌లో అమూల్ గర్ల్ ఇండియన్ ఆర్మీ సిగ్నల్ కార్ప్స్‌కు చెందిన కల్నల్ సోఫియా ఖురేషి, హెలికాప్టర్ పైలట్ వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌లకు వందనం చేస్తున్నట్లుగా అద్భుతంగా చిత్రీకరించారు. పోడియంల ముందు నిలబడి ఉన్న ఈ మహిళా అధికారులకు అమూల్ గర్ల్ సెల్యూట్ చేస్తున్న దృశ్యం అనేక మంది భారతీయులను ఆకట్టుకుంటోంది. తాజాగా అమూల్ చేసిన ఈ ప్రకటనకు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ప్రస్తుత భారత్–పాక్ ఉద్రిక్త పరిస్థితు(India-Pakistan conflict)ల్లో అమూల్ కార్టూన్ భారతీయ పౌరులలో.. సాయుధ దళాల సేవలను స్మరించుకునేలా, దేశభక్తి స్ఫూర్తిని పెంపొందించేలా ఉందని భావిస్తున్నారు.

https://x.com/Amul_Coop/status/1920527524981084253

Next Story