‘ఆపరేషన్ కగార్’ ఎఫెక్ట్.. 12 మంది మావోయిస్టులు సరెండర్

by Kema Shiva Kumar |

దేశంలో దశాబ్దాలుగా తమ ఉనికిని చాటిన మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది.

‘ఆపరేషన్ కగార్’ ఎఫెక్ట్.. 12 మంది మావోయిస్టులు సరెండర్
X

దిశ, వెబ్‌డెస్క్: దేశంలో దశాబ్దాలుగా తమ ఉనికిని చాటిన మావోయిస్టుల మనుగడ ప్రశ్నార్థకం అవుతోంది. 2024 నుంచి కేంద్ర ప్రభుత్వం చేపడుతోన్న భారీ కూబింగ్ ఆపరేషన్లు, వరుస ఎన్‌కౌంటర్లు, పోలీసుల పునరావాసంతో ఉద్యమం రోజురోజుకు బలహీనపడుతోంది. వచ్చే సంవత్సరం మార్చి 31 నాటికి దేశంలో మావోయిస్టుల మాటే వినపడకుండా చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో CPI (మావోయిస్టు) పార్టీ తమ ఆయుధాలను వదులుకుని సమాధాన చర్చలకు సిద్ధంగా ఉన్నట్లు మంగళవారం రాత్రి ఓ ప్రెస్ నోట్ విడుదల చేసింది. అయితే, ఈ క్రమంలోనే మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని నారాయణ‌పూర్‌ జిల్లా పరిధిలోని మొత్తం 12 మంది మావోయిస్టులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. అయితే, వారిలో 9 మంది మావోయిస్టులపై రూ.18 లక్షల చొప్పన రివార్టు ఉన్నట్లుగా పోలీసులు వెల్లడించారు.

కాగా, ఆపరేషన్ కగార్‌లో భాగంగా జరిగిన వరుస ఎన్‌కౌంటర్లలో ఇప్పటి వరకు 300కి పైగా మావోయిస్టులు మరణించారు. అందులో చాలా మంది అగ్ర నేతలు కూడా ఉన్నారు. తెలంగాణలో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్న మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు పోతుల పద్మావతి అలియాస్ సుజాతక్క అలియాస్ మైనక్క కూడా పోలీసుల ఎదుట లొంగిపోయిన విషయం తెలిసిందే.

Next Story