- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Houthis: హౌతీ రెబల్స్ పై దాడి విజువల్స్ వైరల్
హౌతీ రెబల్స్ పై భీకర దాడులకు సంబంధించిన విజువల్స్ ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సోషల్ మీడియాలో షేర్ చేశారు.

దిశ, నేషనల్ బ్యూరో: హౌతీ రెబల్స్ పై భీకర దాడులకు సంబంధించిన విజువల్స్ ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) సోషల్ మీడియాలో షేర్ చేశారు. దాడులు జరిగిన ప్రాంతంలోని డ్రోన్ దృశ్యాలను ట్రంప్ షేర్ చేశారు. ఈసందర్భంగా హూతీలు షిప్ లపై దాడులు చేసేందుకు సమావేశమయ్యారని ఆయన ఆరోపించారు. కానీ, వారు దాడులకు పాల్పడకుండా చర్యలు తీసుకున్నామని చెప్పుకొచ్చారు. ఇక, ట్రంప్ షేర్ చేసిన వీడియోలో రౌండ్‌గా నిల్చొన్న ఒక గ్రూప్ వైమానిక దాడి జరిగినట్లు కన్పిస్తోంది. కాగా.. ఇజ్రాయెల్ (Israel) నౌకలపై దాడులు చేస్తామని యెమెన్ లోని హౌతీ తిరుగుబాటుదారులు ప్రకటించారు. దీంతో హూతీలకు బలమైన సంకేతాలు పంపాలని ట్రంప్ మార్చి 15న ఆదేశించారు. దీంతో, అమెరికా సైన్యం భారీగా దాడులు చేసింది. ఈ దాడుల్లో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. అనేకమంది గాయాలపాలయ్యారు.
ఇరాన్ కు బెదిరింపులు
మరోవైపు, ప్రపంచంలో ఎక్కడైనా జలమార్గాల్లో అమెరికా వాణిజ్య, నౌకాదళ నౌకలు స్వేచ్ఛగా వెళ్లకుండా ఏ ఉగ్రశక్తీ ఆపలేదని ట్రంప్ స్పష్టం చేశారు. అంతేకాకుండా, హౌతీలకు మద్దతిస్తున్న ఇరాన్ కు హెచ్చరికలు జారీ చేశారు. కాగా.. ట్రంప్ బెదిరింపులపై టెహ్రాన్ సుప్రీంలీడర్ ఖమేనీ స్పందిస్తూ.. హూతీల దాడుల్లో తమ ప్రమేయం లేదన్నారు. వారు సొంత కారణాల వల్ల దాడులకు పాల్పడుతున్నారని చెప్పుకొచ్చారు. వాషింగ్టన్ తమపై నిరాధార ఆరోపణలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని బెదిరించారు. మరోవైపు, అమెరికా దాడులను హౌతీ పొలిటికల్ బ్యూరో ఖండించింది. దాన్ని యుద్ధనేరంగా పేర్కొంది. ప్రతీకార దాడులకు రెడీ అని చెప్పుకొచ్చింది.






