- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Supreme Court: నగదు రహిత ట్రీట్మెంట్ ఎందుకు అమలు చేయలేదు
కేంద్రప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'గోల్డెన్ అవర్' సమయంలో అత్యవసర సాయం పొందేందుకు నగదు రహిత ట్రీట్మెంట్ ప్రణాళికను అమలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది.

దిశ, నేషనల్ బ్యూరో: కేంద్రప్రభుత్వంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 'గోల్డెన్ అవర్' సమయంలో అత్యవసర సాయం పొందేందుకు నగదు రహిత ట్రీట్మెంట్ ప్రణాళికను అమలు చేయాలని గతంలో సుప్రీంకోర్టు కేంద్రానికి ఆదేశాలు జారీ చేసింది. మార్చి 14 డెడ్ లైన్ గా విధించింది. కాగా.. ఆ ప్రణాళికను అమలు చేయనందుకు కేంద్రాన్ని మందలించింది. కేసు విచారణ సందర్భంగా జస్టిస్ అభయ్ ఎస్ ఓకా మాట్లాడుతూ.. "ప్రభుత్వానికి ఇచ్చిన సమయం మార్చి 14తో ముగిసింది. ఇది తీవ్రమైన ఉల్లంఘన. ప్రయోజనకరమైన నిబంధనను అమలు చేయడంతో కోర్టు ఆదేశాన్ని ఉల్లంఘించింది. ఇలాంటివి చాలా కాలంగా చూస్తున్నాం. ప్రభుత్వ ఉన్నతాధికారులకు నోటీసులు పంపినప్పుడు వారు కోర్టు ఆదేశాలను తీవ్రంగా పరిగణిస్తారు. లేదంటే, ఆ ఉత్తర్వులను పరిశీలనలోకి తీసుకోరు. ఈ విషయంలో ఎళాంటి పురోగతి లేదని గమనిస్తే కోర్టు ధిక్కార నోటీసులు జారీ చేస్తాం. ఎంతో మంది ఆలస్యంగా చికిత్స పొందడం వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు" అని ఆయన కఠినంగా అన్నారు. అంతేకాకుండా, కేంద్ర ప్రభుత్వం, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి సహా సీనియర్ అధికారులకు సమన్లు జారీ చేసింది. తదువరి విచారణను ఏప్రిల్ 28కి వాయిదా వేసింది.
జనవరిలో విచారణ
కాగా, ఈ ఏడాది జనవరిలో కోర్టు రోడ్డు ప్రమాద బాధితులకు, ముఖ్యంగా 'గోల్డెన్ అవర్' కేసుల్లో బాధఇతుల చికిత్సకు నగదు రహిత పథకం అందుబాటులోకి తేవాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రజలు, పోలీసులు, ఆసుపత్రులు కూడా కొన్నిసార్లు మరొకరు చొరవ తీసుకునే వరకు వేచి ఉంటారని పేర్కొంది. చికిత్సకు చాలా డబ్బు ఖర్చయ్యే సందర్భాల్లో ఈ పద్ధతి వల్ల బాధితుల ప్రాణాలు ప్రమాదంలో పడేస్తుందని కోర్టు పేర్కొంది. సవరించిన మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 162(2) రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత అత్యవసర వైద్య చికిత్సను అందించాలని బీమా కంపెనీలకు ఆదేశం ఉందని కోర్టు పేర్కొంది. ఇది అమలు కాలేదని కూడా గుర్తుచేసింది. ఇకపోతే, డిసెంబర్ 2023లో 'గోల్డెన్ అవర్' సమయంలో నగదు రహిత వైద్య చికిత్స కోసం ప్రణాళికలను కేంద్రం రూపొందించింది.






