- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లుతో 200 స్టార్టప్‌లు, 2 లక్షల ఉద్యోగాలు ఊస్ట్!
ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు 2025ను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది. దీంతో 200 స్టార్టప్‌లు, 2 లక్షల ఉద్యోగాలు పోనున్నాయి.

దిశ, నేషనల్ బ్యూరో: ఆన్‌లైన్ బెట్టింగ్ వల్ల ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారంటూ ‘ఆన్‌లైన్ గేమిగ్ బిల్ 2025’ను ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం. దేశంలో డబ్బుతో ఆడే గేమ్స్‌ను పూర్తిగా నిషేధించాలని నిర్ణయించింది. బెట్టింగ్ గేమ్స్ ప్రజారోగ్యానికి ప్రమాదకరం అని ఈ బిల్లు పేర్కొంది. అయితే పలువురు ఇండస్ట్రీ నిపుణులు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు కనీసం ఇండస్ట్రీ వర్గాలను సంప్రదించకపోవడం కూడా ఈ బిల్లుపై విమర్శలకు దారితీస్తోంది.
భారీగా నష్టాలు..
ప్రజలను కాపాడాలంటే గేమింగ్ ఇండస్ట్రీపై రెగ్యులేషన్ పెట్టాలని, అంతేకానీ ఇలా బ్యాన్ చేయడం వల్ల ఎంతో నష్టం ఉంటుందని చెప్తున్నారు. ఒక్క ఫాంటసీ గేమింగ్ రంగమే ఏటా రూ.1.8 బిలియన్ల వ్యాపారం చేసి, ప్రభుత్వానికి భారీగా జీఎస్టీ చెల్లిస్తోందని అంటున్నారు. దానికితోడు ఈ రంగంలో ఉన్న 2 వేలకుపైగా స్టార్టప్‌లు, 2 లక్షలపైగా ఉద్యోగులు రోడ్డున పడాల్సిన పరిస్థితి వస్తుందంటున్నారు. అలాగే ఈ రంగంలో పెట్టిన 6 బిలియన్ డాలర్ల పెట్టుబడులు విదేశాలకు తరలివెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు.
సుప్రీంకోర్టులో సవాల్?
గతంలో ఫాంటసీ గేమ్స్‌పై కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లినప్పుడు.. అత్యున్నత న్యాయస్థానం కీలకమైన తీర్పునిచ్చింది. అదృష్టంతో గెలిచే గేమ్స్, నైపుణ్యంతో గెలిచే గేమ్స్ అనే రెండు వర్గాలుగా ఈ ఆటలను విభజించింది. నైపుణ్యం (స్కిల్)తో గెలిచే గేమ్స్‌కు అనుమతి లభించింది. ఇప్పుడు ప్రభుత్వం వీటిని నిషేధించడంతో.. ఆర్టికల్ 19(1)(జి) కింద రాజ్యాంగం అందించే ఏ వృత్తి, వ్యాపారం అయినా చేసుకునే హక్కును ఉల్లంఘించినట్లేనని కొందరు న్యాయనిపుణులు అంటున్నారు. ఈ క్రమంలో ఈ బిల్లును సుప్రీంకోర్టులో సవాల్ చేసే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు.






