కుకీ మిలిటెంట్లపై కాల్పులు జరిపిన మరో గ్రూపు.. ఒక స్థానికురాలు దుర్మరణం!

by Phanindra |

కుకీ మిలిటెంట్లపై మరో గ్రూపు కాల్పులకు తెగబడింది. ఈ ఘటనలో ఒక స్థానికురాలు దుర్మరణం పాలైంది.

కుకీ మిలిటెంట్లపై కాల్పులు జరిపిన మరో గ్రూపు.. ఒక స్థానికురాలు దుర్మరణం!
X

దిశ, నేషనల్ బ్యూరో: మణిపూర్‌లో మరో హింసాత్మక ఘటన జరిగింది. కుకీ నేషనల్ ఆర్మీ (కేఎన్ఏ)కి చెందిన డిప్యూటీ చీఫ్‌ను కొందరు దుండగులు కాల్చిచంపారు. ఈ ఘటనలో మరో ఇద్దరు కేఎన్ఏ సభ్యులు, మరో మహిళ మరణించినట్లు అధికారులు చెప్పారు. ఈ ఘటన మణిపూర్‌లోని చురాచాంద్‌పూర్‌లో వెలుగు చూసింది. మరణించిన కుకీ గ్రూప్ సభ్యులను థెంఖోథాంగ్ హాకిప్ అలియాస్ థాపీ (48), సేఖోగిన్ (34), లెంగాహో (35)గా గుర్తించారు. వీళ్లు ముగ్గురూ మాంగ్‌జాంగ్ గ్రామంలో ఒక కార్యక్రమానికి వచ్చారు.

ఒక ఎస్‌యూవీలో ఉన్న వీళ్లపై కొందరు కాల్పులు జరిపారు. ఆ సమయంలో అక్కడే రోడ్డుపై ఉన్న 72 ఏళ్ల ఫాలింగ్ అనే మహిళ కూడా ఈ కాల్పుల్లో దుర్మరణం పాలయ్యారు. యునైటెడ్ కుకీ నేషనల్ లిబరేషన్ ఆర్మీ (యూకేఎన్ఏ)కి చెందిన ఒక నేతను, అలాగే మరో 30 మంది సభ్యులను కేఎన్ఏ గ్రూప్ హతమార్చిందని, అందుకే తాము ఈ దాడి చేశామని యూకేఎన్ఏ గ్రూప్ ప్రకటించినట్లు సమాచారం. కేఎన్ఏ అనేది కుకీ నేషనల్ ఆర్గనైజేషన్ (కేఎన్‌వో) కింద పనిచేస్తున్న 17 గ్రూపుల్లో ఒకటి కావడం గమనార్హం. ఈ దాడి తామే చేసినట్లు (యూకేఎన్ఏ) ప్రకటించింది.

Next Story