అందరికీ ఓకే రకమైన పరిష్కారం సాధ్యం కాదు: సీట్ షేరింగ్ పార్ములాపై శశిథరూర్ వ్యాఖ్యలు

by Dishanational2 |
అందరికీ ఓకే రకమైన పరిష్కారం సాధ్యం కాదు: సీట్ షేరింగ్ పార్ములాపై శశిథరూర్ వ్యాఖ్యలు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఇండియా కూటమిలో మారుతున్న రాజకీయ సమీకరణాల వేళ కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న పార్లమెంటు ఎన్నికలకు సంబంధించి రాష్ట్రాల వారీగా సీట్ల పంపకంపై చర్చలు జరుతున్నాయని తెలిపారు. కానీ అందరికీ ఒకే రకమైన పరిష్కారం దొరకదని అభిప్రాయపడ్డారు. పశ్చిమ బెంగాల్ కాంగ్రెస్ కమిటీ, ఆల్ ఇండియా ప్రొఫెషనల్స్ కాంగ్రెస్ సంయుక్తంగా కోల్‌కతాలో ఏర్పాటు చేసిన ‘షేప్ ది ఫ్యూచర్’ కార్యక్రమంలో శశిథరూర్ ప్రసంగించారు. కేంద్రంలో బీజేపీని ఓడించడమే ఇండియా కూటమి లక్ష్యమని చెప్పారు. ప్రతి రాష్ట్రంలో సీట్ల భాగస్వామ్యంపై ఒకే ఫార్ములా ఉండదని, కాబట్టి సమస్యలు రావడం సహజమేనన్నారు. కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించాలనే దానిపైనే ప్రధానంగా దృష్టి సారించాలని తెలిపారు.

వచ్చే నెల15నాటికి కాంగ్రెస్ మేనిఫెస్టో సిద్ధం

వచ్చే లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి పార్టీ మేనిఫెస్టో తొలి ముసాయిదా ఫిబ్రవరి 15 నాటికి విడుదల చేస్తామని, ఎన్నికల తేదీలు ప్రకటించకముందే తుది ముసాయిదా వెలువడుతుందని శశిథరూర్ స్పష్టం చేశారు. ప్రధాన సమస్యలపైనే మేనిఫెస్టో ఉంటుందని తెలిపారు. నిరుద్యోగం, ధరల పెరుగుదల, మహిళల హక్కులు, యువకులు, రైతులు తదితర అంశాలపై ప్రస్తావని ఉంటుందని చెప్పారు. ‘ప్రతి పార్టీ స్వంత మేనిఫెస్టోపైనే పని చేస్తుందని భావిస్తున్నాను. ఇండియా కూటమి ఉమ్మడిగా ఉన్న అన్ని మ్యానిఫెస్టోల నుంచి అంశాలను ఎంచుకుని మేనిఫెస్టో రూపొందిస్తుంది’ అని వెల్లడించారు. కాగా, పార్టీ మేనిఫెస్టోను రూపొందించే కమిటీలో శశిథరూర్ సభ్యుడు కావడం గమనార్హం.

Next Story

Most Viewed