మృత్యుంజయుడు.. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తి

by Gantepaka Srikanth |   (  Updated:2025-06-12 14:29:39  IST  )

అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదం(Plane Crash) నుంచి ఒక ప్రయాణికుడు సురక్షితంగా బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు.

మృత్యుంజయుడు.. విమాన ప్రమాదం నుంచి బయటపడ్డ ఏకైక వ్యక్తి
X

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్(Ahmedabad) విమాన ప్రమాదం(Plane Crash) నుంచి ఒక ప్రయాణికుడు సురక్షితంగా బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. ఫ్లైట్‌లో 11A సీట్‌లో కూర్చున్న రమేశ్ విశ్వాస్ కుమార్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు. దీనిని అహ్మదాబాద్ పోలీసులు నిర్ధారించారు. ప్రమాదం తర్వాత అక్కడి నుంచి రమేశ్ నడుచుకుంటూ వస్తోన్న విజువల్స్ సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. దీంతో అందరూ రమేశ్‌ను అభినందిస్తున్నారు. ఇంత ఘోర ప్రమాదం నుంచి బయటపడటం చాలా అరుదైన విషయం. నిజంగానే రమేశ్ మృత్యుంజయుడు అని పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఈ ప్రమాదంలో దాదాపు 240కి పైగా ప్రయాణికులు, ఫ్లైట్ సిబ్బంది మరణించారు. ఇదిలా ఉంటే.. విమాన ప్రమాద స్థలి(Plane Crash Site)ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు(Rammohan Naidu) పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన విషయాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు సంతాపం తెలిపారు. చాలా విషాదకరమైన ఘటనగా పేర్కొన్నారు.




Next Story