ఢిల్లీ పేలుడు ఘటనలో ఒకరు అరెస్ట్

by Gantepaka Srikanth |   (  Updated:2025-11-11 12:54:05  IST  )

ఢిల్లీ పేలుడు(Delhi Explosion) ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది.

ఢిల్లీ పేలుడు ఘటనలో ఒకరు అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ పేలుడు(Delhi Explosion) ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఒక అనుమానితుడ్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నారు. ఇదిలా ఉంటే.. కేంద్ర ప్రభుత్వం ఈ ఘటనపై రియాక్ట్ అయ్యింది. ఢిల్లీ సహా దేశంలోని ప్రధాన నగరాల్లో హై అలర్ట్ ప్రకటించింది. ఆయా నగరాల్లో సెక్యూరిటీని కట్టుదిట్టం చేసింది. కేంద్రం అలర్ట్‌తో ప్రధాన నగరాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారు. పేలుడుపై స్పందించిన ఢిల్లీ పోలీసులు.. ఉగ్రవాద చర్యలను తోసిపుచ్చలేమంటున్నారు. ఎర్రకోట దగ్గర చోటుచేసుకున్న ఈ భారీ పేలుడుతో 9 మంది మృతిచెందారు. 10 కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ఘటనలో 20 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు సమాచారం అందుతోంది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. 7 ఫైరింజన్ల సహాయంతో మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఫోర్స్, ఫోరెన్సిక్ సిబ్బంది కూడా ఘటనా స్థలికి చేరుకుంది. పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సంఘటన స్థలంలో ఆధారాలను సేకరిస్తున్నారు. స్థానిక సీసీ టీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.

Next Story