- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CBSE: ఒక్క పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు- మోడీ
సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కాగా.. ఈ పరీక్షల్లో (CBSE Class 10, 12 Results) ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) శుభాకాంక్షలు చెప్పారు.

దిశ, నేషనల్ బ్యూరో: సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు విడుదలయ్యాయి. కాగా.. ఈ పరీక్షల్లో (CBSE Class 10, 12 Results) ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోడీ(PM Modi) శుభాకాంక్షలు చెప్పారు. ఈమేరకు సోషల్ మీడియా ఎక్స్ లో పోస్టు పెట్టారు. “ సీబీఎస్ఈ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు. ఇది విద్యార్థుల సంకల్పం, క్రమశిక్షణ, శ్రమకు దక్కిన ఫలితం. ఈ పరీక్షల్లో విజయానికి దోహదం చేసిన తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, ఇతరుల పాత్రను గుర్తుంచుకొనే రోజు కూడా ఇదే. ముందుముందు వచ్చే అన్ని అవకాశాల్లో పరీక్షా వారియర్లు గొప్ప విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నా. ఇప్పుడు సాధించిన స్కోర్‌ల పట్ల కొంచె నిరుత్సాహంగా ఉన్న వారికి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఒక్క పరీక్ష మిమ్మల్ని ఎప్పటికీ నిర్వచించలేదు. మీ ప్రయాణం ఇంకా చాలా పెద్దది. మీ బలాలు మార్కుల పట్టికను మించిపోతాయి. ఆత్మవిశ్వాసంతో ఉండండి. ఉత్సుకతతో ఉండండి. ఎందుకంటే గొప్ప విషయాలు ఎదురుచూస్తున్నాయి’’ అని సూచించారు.
సీబీఎస్ఈ ఫలితాలు
ఇకపోతే, మంగళవారం సీబీఎస్‌ఈ 10, 12 తరగతి ఫలితాలు(CBSE Class 10, 12 Results) విడుదలయ్యాయి. మంగళవారం ఉదయం 12వ తరగతి ఫలితాలను విడుదల చేసిన సీబీఎస్‌ఈ బోర్డు(CBSE) .. మధ్యాహ్నం పదో తరగతి ఫలితాలను వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఫిబ్రవరి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు సీబీఎస్‌ఈ పది, 12వ తరగతి పరీక్షలు జరగ్గా.. దాదాపు 42లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. సీబీఎస్‌ఈ 12వ తరగతి పరీక్షల్లో 88.39 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్లు అధికారులు తెలిపారు. ఈ ఫలితాల్లో బాలుర కంటే బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణత సాధించినట్లు చెప్పారు. 1.15 లక్షలకు పైగా విద్యార్థులు 90 శాతానికి పైగా మార్కులు సాధించగా.. 24,000 మందికిపైగా విద్యార్థులు 95 శాతానికి పైగా మార్కులు సాధించినట్లు వివరించారు. పదో తరగతి పరీక్షల్లో 93.66శాతం ఉత్తీర్ణత నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి 0.06శాతం ఉత్తీర్ణత అధికంగా నమోదైనట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది 23,71,939మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరయ్యారు. వీరిలో 1.99లక్షల మందికి పైగా విద్యార్థులు 90శాతానికి పైగా స్కోరు సాధించారు. 45వేల మందికి పైగా విద్యార్థులు 95శాతం స్కోరు సాధించారు.






