- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరోసారి ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీనం.. ఇక ఆ నాలుగు బ్యాంకులు కనుమరుగు!
ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను మరింది కుదించి, గ్లోబల్ స్థాయిలో బలమైన బ్యాంకులను సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ రంగ బ్యాంకుల సంఖ్యను కుదించి గ్లోబల్ స్థాయిలో బలమైన బ్యాంకులుగా సృష్టించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రస్తుతం 12 పబ్లిక్ నేషనల్ బ్యాంకులలో నాలుగింటిని విలీనం చేసి మొత్తం వాటిని సంఖ్యను ఎనిమిదికి పరిమితం చేసే యోచనలో కేంద్రం ఉన్నట్లుగా నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే, ఇండియన్ ఓవర్సిస్ బ్యాంక్ (IOB), సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (CBI), బ్యాంక్ ఆఫ్ ఇండియా (BOI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర (BOM)లను పెద్ద బ్యాంకులైన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB), బ్యాంక్ ఆఫ్ బరోడా (BOB) వంటి వాటిల్లో వీటిని విలీనం చేయబోతున్నట్లుగా విశ్వసనీయంగా తెలుస్తోంది. కాగా, విలీన ప్రక్రియకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి సమాచారం లేదని ఆయా బ్యాంకర్లు తెలిపారు. కాగా, ప్రభుత్వ రంగ బ్యాంకుల విలీన ప్రక్రియ అంతా కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది. కేబినెట్ భేటీలో చర్చలు జరిపి, ప్రధాన మంత్రి కార్యాలయం ఆమోదం పొందిన తర్వాతే బ్యాంకుల విలీన ప్రక్రియ ఉండనుంది.






