- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశ రాజధానిలో ఈ-రిక్షా పేలి వ్యక్తి మృతి
by S Gopi |
దేశరాజధానిలో ఈ-రిక్షాలో పేలుడు కలకలం రేపింది. సోమవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు... On Camera, E-Rickshaw Blows Up During Firecracker Drop In Noida, 1 Dead

X
న్యూఢిల్లీ: దేశరాజధానిలో ఈ-రిక్షాలో పేలుడు కలకలం రేపింది. సోమవారం గ్రేటర్ నోయిడాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో కాస్తా ఆలస్యంగా బయటకు వచ్చింది. అయితే ఈ-రిక్షాలో క్రాకర్లు ఉండటమే ప్రమాదానికి కారణమని అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడగా వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే తీవ్రగాయాలతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించినట్లు అధికారులు తెలిపారు. కేవలం సెకన్ల వ్యవధిలోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు అధికారులు తెలిపారు. జగన్నాథ వేడుకల్లో క్రాకర్లను పేల్చేందుకు తరలిస్తున్న క్రమంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు.
Next Story






